Weight loss : రాత్రి పడుకునేముందు ఈ పనులు చేస్తే బరువు తగ్గుతారు!

by sudharani |   ( Updated:2023-01-10 11:49:51.0  )
Weight loss : రాత్రి పడుకునేముందు ఈ పనులు చేస్తే బరువు తగ్గుతారు!
X

దిశ, ఫీచర్స్: ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. రాత్రి మంచిగా నిద్రపోతేనే రోజంతా ఏకాగ్రతతో, ఒత్తిడి లేకుండా పనిచేయగలరు. కానీ, ఇప్పుడు మారిన కాలం ప్రకారం.. ప్రజలు తిండి, నిద్ర విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా స్థూలకాయం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయానికి తినకుండా బరువు పెరుగుతున్నారు. మళ్లీ సన్న పడటానికి రకరకాల వ్యాయామం, డైట్‌లు పాటిస్తున్నారు. అందుకే రోజూ రాత్రిపూట నిద్రించేముందు ఈ ఆరు టిప్స్ పాటిస్తే సులభంగా బరువు తగ్గొచ్చు.

* రాత్రి భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేట్ నైట్ కాకుంగా నిద్రకు 2 గంటల ముందు భోజనం చేయాలి. అది కూడా అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు తేలికైన భోజనం చెయ్యాలి. సాధ్యమైనంతవరకూ త్వరగా జీర్ణమయ్యే పదార్థాలను తీసుకోవాలి. భోజనం తర్వాత కాసేపు వాకింగ్ చేయాలి.

* అలాగే తినడానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. దాంతోపాటు ఎక్కువగా తినకుండా ఉంటారు. అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ఇది దోహదపడుతుంది.

* బరువు పెరగటానికి దోహదపడే కారణాల్లో ఒత్తిడి ప్రధానమైంది. రోజంత వర్క్ పరంగా, ఫ్యామిలీ టెన్షన్, ఫైనాన్షియల్‌గా స్ట్రేస్‌కి గురవుతుంటారు. అందుకే నిద్రించేముందు మెడిటేషన్ చాలా ముఖ్యం. మెడిటేషన్ చేయడం మూలంగా మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది.

* చాలామంది రాత్రి నిద్రపోయేముందు ఆల్కహాల్ తీసుకుంటారు. కానీ, అది మంచిది కాదు. దీనివల్ల వేగంగా బరువు పెరుగుతారు.

* కొంతమందికి పడుకునే ముందు స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ, అది చల్లని నీళ్లతో కాకుండా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఎందుకంటే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల బాడీ పూర్తిగా రిలాక్స్ అవుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది.

*అలాగే పడుకునేముందు పాలు తాగితే చాలా మంచిది. కానీ, పొరపాటున టీ, కాఫీలు తాగకూడదు. ఎందుకంటే రాత్రి టీ, కాఫీ తాగడం వల్ల నిద్రపై ప్రభావంపడుతుంది. నిద్ర పూర్తికాకపోవడంతో మెటబోలిజం పాడవుతుంది. ఇది బరువు పెరిగేందుకు తొడ్పడుతుంది. ఈ 6 నియమాలు రాత్రిపూట విసుగు అనుకోకుండా పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.

Read more:

LIC అదిరిపోయే ప్లాన్.. ప్రతి నెలా రూ. 11 వేలకు పైగా పొందొచ్చు

Sleep: నిద్రలేమితో గుండె, శ్వాసకోశ వ్యాధులు.

Advertisement

Next Story

Most Viewed