ఇకపై వాట్సాప్‌లో షాపింగ్ చేయొచ్చు..JIO Mart

by sudharani |   ( Updated:2022-08-30 11:20:33.0  )
ఇకపై వాట్సాప్‌లో షాపింగ్ చేయొచ్చు..JIO Mart
X

దిశ, ఫీచర్స్ : వాట్సాప్‌తో టై-అప్ అయిన రిలయన్స్ రిటైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌పైకి 'జియోమార్ట్'ను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు వాట్సాప్‌లోనే జియోమార్ట్ నుంచి కిరాణా సామాగ్రి సహా ఇతర సరుకులను ఆర్డర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. వాట్సాప్ చాట్‌ను వదలకుండానే కిరాణా కేటలాగ్ ద్వారా బ్రౌజ్ చేసేందకు, కార్ట్‌కు వస్తువులను జోడించడానికి, ఆన్‌లైన్ చెల్లింపు చేయడానికి లేదా కొనుగోలును పూర్తి చేసేందుకు అనుమతివ్వడం సహా 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆప్షన్ కూడా ఇక్కడే ఎంచుకోవచ్చు.

మన దేశ డిజిటల్ కొనుగొళ్లను వేగవంతం చేయడం సహా ప్రజలంతా కూడా వ్యాపారాలకు కొత్త మార్గాల్లో కనెక్ట్ అవ్వడానికి, దేశంలో ఆర్థిక వృద్ధికి మెటా-జియో ప్లాట్‌ఫామ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చాయి. ఈ మేరకు వాట్సాప్‌లోని జియోమార్ట్ భారతదేశంలోని వ్యాపారాలు, వినియోగదారులతో కనెక్ట్ అయ్యే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని, వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుందని రిలయన్స్ పేర్కొంది.

గైడ్ ఫర్ జియోమార్ట్ షాపింగ్

* షాపింగ్ ప్రాసెస్‌ను ప్రారంభించేందుకు ముందుగా వాట్సాప్‌లోని జియోమార్ట్ స్మార్ట్‌బాట్‌కి 'హాయ్' అని పంపాలి.

* ఆ తర్వాత జియోమార్ట్ వాట్సాప్ బాట్ ద్వారా లింక్ పంపబడుతుంది. ఆ లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా వాట్సాప్ షాపింగ్ కోసం కేటగిరీలతో కూడిన కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.

* అక్కడ జియోమార్ట్ కేటలాగ్‌ను బ్రౌజ్ చేసుకునే అవకాశముంటుంది.

* సంబంధిత కేటగిరీలో మీకు కావాల్సిన షాపింగ్ వస్తువును కనుగొనవచ్చు లేదా సెర్చ్‌లో వెతకవచ్చు.

* అంశాన్ని శోధించిన తర్వాత, దానిని కార్ట్‌కు జోడించాలి.

* మీరు కొత్త వినియోగదారు అయితే అడ్రస్ వివరాలను అందించాల్సి ఉంటుంది.

* తర్వాత, చెల్లింపు గేట్‌వేపై క్లిక్ చేసి, చెల్లింపు పద్ధతిని ఎంచుకోవాలి.

*UPI, క్యాష్ ఆన్ డెలివరీ, ఇతర పేమెంట్ ఆప్షన్స్ ఆధారంగా వాట్సాప్ పే ద్వారా చెల్లింపు చేయవచ్చు.

* చెల్లింపును పూర్తి చేసిన తర్వాత, వాట్సాప్ టెక్స్ట్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

* షాపింగ్ చేసిన వస్తువు డెలివరీ పూర్తయ్యే వరకు వాట్సాప్‌లో తదుపరి నోటిఫికేషన్స్ అందుతాయి.

కొత్తగా మేం జియోమార్ట్ డిజిటల్ (JMD) ఇన్షియేట్‌ను ప్రారంభించాం. ఇది వాట్సాప్‌లో జియోమార్ట్‌తో‌ మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవం. మా నూతన మోడల్ చిన్న వ్యాపారులు తమ వస్తువులను విక్రయించేందుకు అనుమతిస్తుంది. వారికి అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడంలో, వారి ఆదాయాన్ని పెంచుకోవడంలో సాయపడుతుంది.

- ఇషా అంబానీ

Advertisement

Next Story