కిక్కెక్కించే ఆలయం.. భక్తులకు తీర్థంగా మందు పంపిణీ.. మీరూ వెళ్లొచ్చు!

by Sumithra |   ( Updated:2023-02-14 04:33:46.0  )
కిక్కెక్కించే ఆలయం.. భక్తులకు తీర్థంగా మందు పంపిణీ.. మీరూ వెళ్లొచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా వరకు ఆలయాల్లో కొబ్బరి నీళ్లని, తులసి నీళ్లని తీర్థంగా ఇస్తారు. ఇక నైవేద్యంగా కొబ్బరిని అలాగే పండ్లను పెడతారు. కానీ ఓ ఆలయంలో మాత్రం వైన్ ను, ద్రాక్షపండ్లను తీర్థప్రసాదాలుగా పెడతారంట. వింటుంటే చాలా విచిత్రంగా ఉంది కదా.. అంత విచిత్రమైన ఆలయం ఎక్కడ ఉందో.. వైన్ ను నైవేద్యంగా పెట్టే ఆచారం ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

జపాన్‌లోని దేశంలో టోక్యో నగరం నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో యమనాషి అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఈ డైజెన్-జీ అనే ఆలయం ఉందంట. ఈ ఆలయంలో వైన్ సీసాలను, ప్రజలు ద్రాక్ష పండ్లను పవిత్రంగా భావించి నైవేద్యంగా పెడతారంట. ఏదైనా కోరికలు ఉంటే ఆ ఆలయంలో వాటిని సమర్పిస్తారట. అదే ఇక్కడి ప్రత్యేకత అని స్థానికుల చెబుతుంటారు. ఈ యమనాషి అనే ప్రదేశంలో జపాన్‌లోనే ఎంతో ఫేమస్ అయిన వైన్ తయారీ ఫ్యాక్టరీలు ఉండడం గమనార్హం.


చరిత్ర..

ఎనిమిదవ శతాబ్దం ప్రారంభంలో గ్యోకి అనే బౌద్ధ సన్యాసి జపాన్‌లోని కోషు లోయను సందర్శించినప్పుడు ఒక కల వచ్చిందట. ఆ కలలో యకుషి న్యోరాయ్ అనే వైద్యుగురువు చేతిలో మెడిసిన్, ఒక చేతిలో ద్రాక్ష గుత్తి, మరొక చేతిలో మందు బాటిల్ పట్టుకుని గ్యోకి కలలో వచ్చాడట. అనారోగ్యంతో బాధపడే ఎంతోమందికి వైద్యగురువు ఎన్నో ఔషధాలను ఉపయోగించి బాగు చేసేవాడట. గ్యోకి అనే బౌద్ధ సన్యాసికి కళవచ్చిన ప్రదేశంలోనే ఓ దేవత విగ్రహాన్ని చెక్కి డైజెంజి ఆలయాన్ని నిర్మించాడట. ఆ తరువాత వైద్య ప్రయోజనాల కోసం ద్రాక్షపంటను వేయడం ప్రారంభించాడట. ద్రాక్ష ఔషధ ప్రయోజనాల గురించి, సాగు పద్ధతులను ప్రచారం చేయడం ప్రారంభించాడట.


దాంతో కోషు లోయప్రాంతమంతా ద్రాక్షపంటతో నిండిపోయిందట. కోషు వైన్‌ను తయారు చేసేందుకు రైతులు పాడైన ద్రాక్షను సేకరించి, పులియబెట్టడం ప్రారంభించారట. ఇదేపద్దతి లోయ అంతటా కొనసాగింది. ఇక్కడ తయారు చేసేవైన్ ఎంతో ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుందట. శతాబ్దాలు గడిచిన తరువాత అంటే 1953లో జపాన్ గ్రేప్ టెంపుల్ గురించి తెలిసిందట. ప్రస్తుతం ఆలయ ప్రధాన సన్యాసిగా ఉన్న టెస్షు ఇనోయు 40 సంవత్సరాలుగా కోషు వైన్‌ను తయారు చేస్తున్నాడట. పక్కనే అందమైన కొండ ప్రాంతం కూడా ఆకట్టుకుంటుంది. ఈ ప్రదేశం మొత్తం చూడముచ్చటగా ఉంటుంది. మీరెక్కడ చూసినా ద్రాక్ష పండ్లే కనిపిస్తాయి.


ఈ ఆలయం ఎప్పటిదంటే..

ఆలయంలో ఉండే ప్రధానమైన హాలు ఎంతో అద్భుతంగా, విశాలంగా ఉంటుంది. దీన్ని కామకురా కాలంలో అంటే సుమారు 1192-1333 కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఆలయ పరిసరప్రాంతంలో చిన్న మందిరంలో యకుషి న్యోరై విగ్రహం కూడా దర్శనం ఇస్తుంది. విగ్రహం చేతిలో కూడా ద్రాక్ష గుత్తి కనిపిస్తుంది. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహాన్ని బయటకు చూపిస్తారట. ఈ ఆలయంలో ఉండే ప్రధాన మండపంలో మద్యం సీసాలను, ద్రాక్షపండ్లను నైవేద్యంగా ఉంచుతారు.

ఇవి కూడా చదవండి : శివరాత్రి రోజు ఇలా చేస్తే ఇష్టమైన వ్యక్తితో పెళ్లి అవుతుందంట?

Advertisement

Next Story

Most Viewed