- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తస్మాత్ జాగ్రత్త.. ఈ ట్రాన్సాక్షన్లతో ఐటీ నోటీస్ రాగలదు..
దిశ, ఫీచర్స్ : పరిమితికి మించి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేసి ఐటీ శాఖకు తెలియజేయకుండా దాటిపెట్టారో అంతే సంగతి. కొన్ని రోజుల్లోనే దిమ్మదిరిగే నోటీసులు ఇంటికి వచ్చేస్తాయి. ఐటీశాఖను మోసం చేయాలనుకుంటే జరిమానాతో పాటు ఒక్కోసారి జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. అందుకే లావాదేవీల పరిమితి దాటినప్పుడు తూచా తప్పకుండా ఐటీ శాఖకు తెలియజేయాలి. ఇంతకీ అంత పెద్ద లావాదేవీలు ఏమై ఉంటాయి, ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఐటీకి తెలియజేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫారెన్ కరెన్సీ : ఒక ఆర్థిక ఏడాదిలో విదేశీ కరెన్సీ ట్రాన్సాక్షన్లను రూ. 10 లక్షలకు మించి చేస్తే ఐటీ శాఖకు తెలపాలి. లేదంటే ఐటీ శాఖ చర్యలు తీసుకుంటుంది.
క్రెడిట్ కార్డు బిల్లు: ఒక ఆర్థిక ఏడాదిలో క్రెడిట్ కార్డు బిల్లును రూ.10 లక్షల కంటే ఎక్కువ చెల్లిస్తే వివరాలను ఐటీ శాఖకు అందజేయాలి. మీరు తెలియజేయకపోయినా పాన్ కార్డుతో లింక్ అయి ఉన్న క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేసి నోటీసులు పంపిస్తారు.
సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు : ఒక ఆర్థిక ఏడాదిలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదును తన అకౌంట్ లో డిపాజిట్ లేదా విత్ డ్రా చేస్తే ఆదాయ పన్ను శాఖకు ఐటీఆర్ ద్వారా తెలియజేయాలి. లేని పక్షంలో ఖాతాదారునికి ఐటీ నుంచి నోటీసులు వచ్చేస్తాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు : భవిష్యత్తు ప్రణాళికగా ఎవరైనా వారి అకౌంట్లో రూ.10 లక్షలకు మించి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే ఐటీ శాఖకు తెలియజేయాలి. అలాగే ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ఎఫ్‌డీలలో ఈ పరిమితి మించరాదు. అలా దాటితే ఐటీ శాఖకు సమాచారం అందించాలి.
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు : ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లలో పెట్టుబడి పెడితే ఐటీ శాఖకు ఆ వివరాలు తెలపాలి.
స్థిరాస్తి వివరాలు : రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదుతో ఆస్తిని కొనుగోలు చేస్తే ఆ లావాదేవీల వివరాలను ఆస్తి రిజిస్ట్రార్ ఆదాయపు పన్ను శాఖకు అందించాలి. లేదంటే చట్టం తనపని తాను చేసుకుంటుంది.