- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పు దానం చేస్తే మంచిది కాదా..? హిందూ ధర్మం ఏం చెబుతుంది..
దిశ, వెబ్ డెస్క్: ‘అన్ని వేసి చూడు నన్నేసి చూడు’ అనే సామెత అందరికి తెలిసే ఉంటుంది. ఏదైనా కూర వండినప్పుడు ఎన్ని రకాల దినుసులు వేసినప్పటికీ ఉప్పు కలపకపోతే ఆ కూర అసంపూర్ణంగానే ఉంటుంది. రుచిగా కూడా ఉండదు. ఈ సందర్భంలోనే పై సామెత ఉపయోగిస్తారు. మరీ ఉప్పును ఇతరులకు దానం చేయొద్దు అంటారు ఎందుకని..? ఒక వేళ దానం చేస్తే ఎలా చేయాలి..? దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతుందంటే.. మనం దానం చేసే దశ దానాల్లో ఉప్పు ఒకటి. పితృ దానాల్లో శని దానాల్లో ఉప్పుని దానం చేస్తుంటారు. అందుకే పూజల దగ్గర ఉప్పుని దూరంగా ఉంచుతారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా నమ్ముతారు. ఉప్పు అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతుంటారు.
ఇక పురాణాల ప్రకారం..
అమృతం కోసం చేసిన సాగర మధనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారు అవుతుంది. అందుకే ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టు ఎక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా జ్యేష్టాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తుంటారు. అందుకే ఉప్పును చేతికి ఇవ్వవద్దని పేర్కొంటారు. ఈ చిట్కాను మీరు కూడా పాటించి సంతోషంగా ఉండండి.
Read more: