మార్నింగ్ వేళ ఫ్రూట్స్ జ్యూస్, డీటాక్స్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా..?

by Anjali |   ( Updated:2025-03-16 04:10:22.0  )
మార్నింగ్ వేళ ఫ్రూట్స్ జ్యూస్, డీటాక్స్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ అత్యంత సాధారణ మార్గం సహజ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. బాడీని డీటాక్స్ చేయాలంటే పలు డ్రింక్స్ తాగాలని నిపుణులు చెబుతూనే ఉంటారు.

డీటాక్స్ డ్రింక్స్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లైతే.. మెరుగైన మానసిక ఆరోగ్యం, శారీరక శ్రేయస్సు, అనేక వ్యాధుల్ని దూరంగా ఉంచుతుంది. అలాగే శక్తి స్థాయిల్ని పెంచుతుంది. శరీరం హైడ్రేషన్,స్కిన్ అండ్ హెయిర్ హెల్త్‌గా ఉంటుంది.

శరీరం యొక్క pH ని సమతుల్యం చేస్తుంది. ఇందుకు వేప రసం, గోధుమ గడ్డి రసం, కలబంద రసం, మునగ రసం, నోని రసం వంటి అనేక ఆయుర్వేద డీటాక్స్ జ్యూస్‌లు రోజువారీ ఉపయోగం కోసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే కలబంద రసం వంటి రసాలు మీ చర్మం, జుట్టుకు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇతర జాగ్రత్తలతో పాటు ఈ డీటాక్స్ రసాలను తీసుకోవడం వల్ల మీ స్కిన్ మెరుస్తూ.. జుట్టు బలంగా ఉంటుంది.

అలగే మీ నీటిలో ద్రాక్ష వంటి తాజా పండ్లను జోడించి, రోజంతా త్రాగడం వల్ల అది రుచికరంగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. ఉదయం మీ రోజును ప్రారంభించడానికి ఒక గ్లాసు రసం తాగడం మేలు.

ఇక పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి.

మరీ మార్నింగ్ వేళ ఫ్రూట్స్ జ్యూస్, డీటాక్స్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం.. బాడీని డీటాక్స్ చేయడానికి మీరు సెపరేట్‌గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మన బాడీకి దానంతట అదే డీటాక్స్ చేసుకునే సామర్థ్యం ఉంటుందట. కేవలం మనం వాటర్ తగిన మోతాదులో అండ్ హెల్తీ డైట్ ఫాలో అయితే చాలని నిపుణులు అంటున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More..

పడుకునే ముందు వాము నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు..?

Next Story

Most Viewed