- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాలిన గాయాలపై కోల్‌గేట్ రాస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
దిశ, ఫీచర్స్: సాధారణంగా మన చేతులు, కాళ్లు ఏదైనా వేడి తాకి కాలిపోయిన తర్వాత అయ్యే గాయం పై చాలామంది ఐస్ లేదా కోల్ గేట్ రాసుకుంటూ ఉంటారు. ఇలా కొల్డ్ స్టఫ్‌ను అప్లైయ్ చేయడం వల్ల బొబ్బలు ఏర్పడకుండా ఆగిపోతుందని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే వైద్యులు ఐస్ లేదా కోల్‌గేట్ గాయాలపై ఎప్పుడూ కూడా రాయోద్దని అంటున్నారు. దాని వెనుక కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
కాలిన గాయాలపై ఐస్ లేదా కోల్‌గేట్ రాయడం చాలా ప్రమాదం అని అంటున్నారు నిపుణులు. అయితే ఐస్ పూయడం వల్ల ఆ ప్రాంతంలో బ్లడ్ సర్కులేషన్ ఆగిపోతుంది. దాని వల్ల ఆ గాయం మానడానికి చాలా సమయం పడుతుంది. అలాంటప్పుడు ఈ సమయంలో మనం కాలిన గాయాన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ట్యాప్ వాటర్ కింద ఉంచాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. అదేవిధంగా గాయం త్వరగా మానడానికి దోహద పడుతుంది.
అదేవిధంగా చాలా మంది కాలిన ప్రదేశంలో నెయ్యి, లేదా ఆయిల్ కూడా రాస్తుంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకి గాయం ఇంకా బాధిస్తుంది. అలా కాకుండా నీటితో గాయమైన ప్రాంతాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఏదైనా బర్న్ క్రీమ్ రాస్తే గాయాలు త్వరగా మానుతాయి.(గమనిక: క్రీమ్స్ డాక్టర్స్‌చే సూచించబడినది ఉండాలి). ఇంకా త్వరగా చికిత్స చేయాలంటే అలోవెరా జెల్ లేదా రోజ్ వాటర్ స్ర్పే చేయవచ్చు.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.