Wedding Card : పేడతో చేయించిన వెడ్డింగ్ కార్డు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే...

by Sujitha Rachapalli |
Wedding Card : పేడతో చేయించిన వెడ్డింగ్ కార్డు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే...
X

దిశ, ఫీచర్స్: జైపూర్‌కి చెందిన భీమ్ రాజ్ శర్మ ఆవు పేడతో పేపర్ తయారు చేయవచ్చని సూచిస్తే సోది చెప్తున్నాడు అనుకున్నారు జనాలు. 4000-1500 BC లో సింధు లోయ నాగరికతలో ఇలా చేశారని చెప్పాడు. కానీ అది అసాధ్యం అని కొట్టిపారేశారు. అయితే అదే ఐడియాను ఫాలో అయిన శర్మ... 2014 లో పేడ నుంచి పేపర్ తయారు చేయడంలో సక్సెస్ అయి చూపించాడు. అనుమానాలు, ఆర్థిక అడ్డంకులు ఉన్నప్పటికీ.. ఆవు పేడ కాగితం తయారీ యూనిట్‌ను స్థాపించడానికి తన కుమార్తె వివాహానికి దాచిన డబ్బులను వినియోగించాడు.

మొత్తానికి ఐదేళ్ల తర్వాత శర్మ పట్టుదల ఫలించింది. అతని సంస్థ గౌక్రిటీ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్న ఆవు పేడ కాగితం పేటెంట్ రైట్స్ పొందింది. అంతేకాదు పేడ నుంచి తయారు చేస్తున్న వెడ్డింగ్ కార్డ్ డిజైన్స్ పాపులర్ అయిపోయాయి. దేశ వ్యాప్తంగా పెరిగిన కస్టమర్ బేస్ తో రోజువారీ విక్రయాలు 3.000 షీట్‌లకు పైగా ఉన్నాయి. కాగా ఆవు పేడను సెంటిమెంట్ గా పరిగణిస్తున్న హిందువులు ఇలాంటి వెడ్డింగ్ కార్డుకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటం శర్మ బిజినెస్ కు ప్లస్ అయింది.


(Story Credit To The Better India Instagram Channel)

Next Story