ఇంట్రెస్టింగ్.. చనిపోయిన పాముకూడా కాటు వేస్తుందని తెలుసా?

by Jakkula Samataha |
ఇంట్రెస్టింగ్.. చనిపోయిన పాముకూడా కాటు వేస్తుందని తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : పాముల గురించి అందరూ చెబుతుంటే వింటూనే ఉంటాం. ఇవి పొలాల్లో, ఇళ్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక పామును చూస్తే చాలు అందరు భయపడి పోతుంటారు.అలాగే పాములు మన ఇంటి చుట్టూ లేదా మన ఇంటిలోపలికి వస్తే వెంటనే దాన్ని వెతికి మరి చంపేస్తుంటారు. దీంతో అవి చనిపోతుంటాయి. కానీ చనిపోయిన పాము కూడా కాటు వేయగలదనే విషయం మీకు తెలుసా?

అవును మనం చాలా సంఘటనలు చూశాం. చనిపోయిన పామును చూస్తుండగా, సడెన్‌గా ఆ పాము లేచి చిన్న బాబును కాటు వేస్తే, ఆ చిన్నారి చనిపోయాడు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అయితే అమెరికాలో కూడా ఇలాంటిదే ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.టెక్సాస్‌లో ఓ వ్యక్తికి, తెగిపడిన పాము తల కాటు వేసింది. ఆ వ్యక్తికి 26 డోసుల యాంటీ-వెనమ్ ఇచ్చాకే అతను ప్రాణాలతో బతికాడు.

అసలు చనిపోయిన పాము, తల తీసేసిన స్నేక్ ఎలా కాటు వేసిందో ఇప్పుడు చూద్దాం.. పాములు చనిపోయిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు సజీవంగా ఉంటాయంట. సాధారణంగా ఏజీవి అయినా సరే చనిపోయిన వెంటనే లేదా, తలను తీసేసిన వెంటనే చనిపోతుంది. కానీ పాములు, ఎక్టోథర్మ్ జంతువుల విషయంలో ఇలా జరగదంట. వాటి మెదడుకు శక్తిని అందించడానికి ఆక్సిజన్ అంత ఎక్కువగా అవసరం కాదు. ఆ పరిస్థితిలో, పాము దాని తలను కత్తిరించిన తర్వాత కూడా చాలా నిమిషాల నుంచి గంటల పాటూ జీవించగలదు, ఎందుకంటే ఆక్సిజన్ దాని మెదడుకు చాలా కాలం పాటు సరఫరా అవుతుంది.అందువలన చనిపోయిన పాము కూడా కాటు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.

Advertisement

Next Story

Most Viewed