- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోల్‌కతాలో 'పెన్ హాస్పిటల్'.. 77 ఏళ్లుగా పాడైన పెన్నులకు జీవం!
దిశ, ఫీచర్స్ : 'కత్తి కంటే కలం శక్తివంతమైనది' అంటూ కలం విలువను నవల, నాటక రచయిత ఎడ్వర్డ్ బుల్వర్- లిట్టన్ ఎంతో గొప్పగా సంక్షిప్తీకరించాడు. రచయితలు, జర్నలిస్ట్‌లకు అమూల్యమైన ఆస్తిగా పేరొందిన 'కలం'తో వారిది అవినాభావ సంబంధం. రామాయణాన్ని రాసిన వాల్మీకి మొదలు.. ఆధునిక రచయితల వరకు 'సిరా'క్షరాలతో ప్రపంచ మార్పునకు కారణమయ్యారు. అయితే ఏ చరిత్రను ఏ సిరాతో రాసినా.. ఎంత గొప్ప కావ్యాన్ని లిఖించినా.. పెన్నులో సిరా అయిపోతే దాన్ని పారేయాల్సిందే. అంతకుముందే పాడైనా, విరిగినా చెత్తపాలు చేయాల్సిందే. కానీ కోల్‌కతా ప్రజలు మాత్రం తమ పెన్నులు పాడైతే రిపేర్ కోసం 'పెన్ హాస్పిటల్'కు తీసుకెళ్తారు. అయినా మనుషులు, పశువులు, జంతువులకు హాస్పిటల్స్ ఉంటాయి గానీ 'పెన్'కు కూడా ఆస్పత్రి ఏంటని ఆశ్చర్యపోతున్నారా?
పెన్నులకు కూడా ఓ ఆస్పత్రి ఉందంటే.. ఎవరికీ నమ్మశక్యం కాదు. కానీ ఈ 'పెన్ ఆసుపత్రుల'కు కోల్‌కతా నగరం కేరాఫ్‌గా మారింది. అలాంటి చాలా ఆస్పత్రులు కాలక్రమేణా కనుమరుగైనా కోల్‌కతా నడిబొడ్డున మాత్రం ఒక పెన్ హాస్పిటల్ ఇప్పటికీ దర్పం ఒలకబోస్తోంది. ఇక్కడకు వచ్చే పాత, విరిగిన పెన్నులను డాక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ చక్కగా ట్రీట్ చేస్తాడు. ఇంతియాజ్ తాత సంసుద్దీన్ 1945లో ఈ ఆస్పత్రిని ప్రారంభించగా, రెండు తరాల నుంచి కొనసాగిస్తున్నారు. విదేశాలకు చెందిన వాటర్‌మన్, షెపర్డ్, పియరీ కార్డా, విల్సన్ వంటి రాయల్ పెన్నులు ఇక్కడ విక్రయించేవాళ్లు. కానీ అంత ఖరీదైన పెన్నులు పాడైపోతే రిపేర్ చేసే వాళ్ళు లేక బాధపడేవాళ్లు. దీంతో తమ తమ సంసుద్దీన్ స్వయంగా వాటిని రిపేర్ చేయడం మొదలుపెట్టడంతో పెన్ హాస్పిటల్ ప్రయాణం మొదలైందని ఇంతియాజ్ తెలిపారు.
ఈ హాస్పిటల్ సేకరణలో రూ. 20 నుంచి రూ. 20,000 వరకు పెన్నులు ఉన్నాయి. వివిధ పరిమాణాలు, ఆకారాలకు సంబంధించిన భిన్నమైన పెన్నులు, వాటి ముల్కీలు ఉపయోగించి విరిగిన పెన్నులకు 'వైద్యం' చేస్తున్న ఇంతియాజ్.. వాటికి కొత్త జీవితాన్ని పోస్తున్నాడు. సుదీర్ఘమైన ఇలస్ట్రేటెడ్ చరిత్రలో అనేక మంది ప్రసిద్ధ ప్రొఫెసర్లు, రచయితలు, జర్నలిస్టులు తమకు ఇష్టమైన పెన్నుల రిపేర్ కోసం ఈ పెన్ హాస్పిటల్‌కు రావడం విశేషం.
ప్రస్తుతం ఎక్కడ చూసినా సింగిల్ యూజ్ పెన్నులే ఉపయోగిస్తున్నారు. కానీ ఇంకుతో రాసేవాళ్లు లేకపోలేదు. అలాంటి వాళ్లే తమ విరిగిన పెన్నును సరిచేసుకునేందుకు నా దగ్గరకు వస్తారు. కొంతమంది ప్యాషన్, ఇంకొంతంమంది ఫ్యాషన్ కోసం పాత పెన్నులు కొనుగోలు చేస్తారు. ఇక విదేశీ పెన్నులు చాలా ఖరీదైనవి. ఇప్పటికి కూడా రూ.10,000-12,000 విలువ చేసే పెన్నులను రిపేర్ కోసం నా దగ్గరకు తీసుకొస్తుంటారు. పెన్ నిబ్ నుంచి ఇంక్ ఫిల్లింగ్ సిస్టమ్.. ఒక్కో పెన్నుకు భిన్నంగా ఉంటుంది. అన్ని పెన్ భాగాలు సులభంగా దొరకవు. అలాంటప్పుడు పాత పెన్నులతో కొత్త పెన్నులు రిపేర్ చేస్తాం.
- ఇంతియాజ్