మంచి మనుషులు మన చుట్టూ ఉండాలండి.. లేదంటే ఎంత నష్టమో తెలుసా?

by Sujitha Rachapalli |
మంచి మనుషులు మన చుట్టూ ఉండాలండి.. లేదంటే ఎంత నష్టమో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: మన చుట్టూ ఉండే మనుషులే.. మన లైఫ్ ఎలా ఉండేది డిజైన్ చేస్తారు. పాజిటివ్ పీపుల్ ఉంటే హ్యాపీగా.. లేదంటే వరస్ట్ గా ఉంటుంది. అందుకే మన మూడ్ ను లిఫ్ట్ చేసే పర్సన్స్, నాలెడ్జ్ పెంచి మన ఎదుగుదలకు కారణం అయ్యే వ్యక్తులు.. ఇలా అన్నింటిలో సపోర్ట్ చేసే సహవాసం ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అసలు ఎందుకు మనతో రైట్ పీపుల్ ఉండాలి? తెలుసుకుందాం.


1. లైక్ మైండెడ్

ఒకే రకమైన భావాలు కలిగిన వ్యక్తులు ప్రతిసారి మీతో ఏకీభవించకపోవచ్చు కానీ సిమిలర్ వాల్యూస్, గోల్స్ మీతో షేర్ చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు మీ కన్నా స్మార్ట్ కావచ్చు.. మీకంటే ముందే గోల్ రీచ్ అయ్యుండొచ్చు. మీకు రోల్ మోడల్ గా, మెంటార్ గా మారవచ్చు.

2. కొత్తగా నేర్చుకోవచ్చు

మంచి మనుషులు వారు ఎందులో అయితే ఎక్సపర్ట్స్ అయి ఉంటారో అవి మనకు నేర్పించు ముందుకు వెళ్లేలా పుష్ చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు హెల్ప్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ లో ఇంటలెక్చువల్స్ అయ్యేలా చేస్తారు.

3.పాజిటివ్ అవుట్ లుక్

మన చుట్టూ నెగెటివ్ పీపుల్ ఉంటే మన ఎదుగుదలకు ఉపయోగపడే గోల్స్ పై ఫోకస్ చేయలేం. అదే రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మన లక్ష్యాలను రీచ్ అయ్యేందుకు మద్దతు లభిస్తుంది.

4. సిమిలర్ జర్నీ

మోస్ట్ సక్సెస్ ఫుల్ పీపుల్ కూడా జీవితంలో ఎంతో కొంత వెలితి కలిగి ఉంటారు. అయితే మన సర్కిల్ లో మంచి మనుషులను కలిగి ఉంటే.. సిమిలర్ జర్నీ చేసిన వాళ్లతో కనెక్ట్ అవుతాం. ఈ గోల్ సెట్టర్స్ మనలోని బెటర్ వెర్షన్ ను రీచ్ అయ్యేందుకు సహాయపడతారు.

5. రియల్ ఫేస్ టైం

సక్సెస్ ఫుల్ గా టార్గెట్ చేరుకున్న వ్యక్తులు.. అదంతా ఎలా సాధ్యం అయిందనేది పంచుకుంటారు. తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలు, టిప్స్, ట్రిక్స్ చెప్తూ.. మన డ్రీమ్స్ ఈజీగా ఫుల్ ఫిల్ చేసుకునేందుకు హెల్ప్ అవుతారు. కాబట్టి మీ ఫీల్డ్ లో అలాంటి వ్యక్తులను వెతికి పట్టుకుని .. వారి అనుభవాన్ని

మీరు విజయానికి బాటగా మార్చుకోండి.

6. వైవిధ్యంగా ఉండటం

విభిన్న సంస్కృతులు, నేపథ్యాలు, పరిశ్రమలకు చెందిన వ్యక్తులతో స్నేహం

చేయడం వల్ల ప్రపంచాన్ని చూసే కోణం విస్తృతం అవుతుంది. డైవర్సిటీని

స్వీకరించడం వల్ల ప్రతి ఒక్కరూ ఒకరి నుంచి మరొకరు నేర్చుకొని అభివృద్ధి చెందగలిగే అట్మాస్పియర్ ఏర్పడుతుంది.

Advertisement

Next Story

Most Viewed