పచ్చని చెట్ల మధ్యలో మీ ఇళ్లు ఉందా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

by Jakkula Samataha |
పచ్చని చెట్ల మధ్యలో మీ ఇళ్లు ఉందా..  ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : పచ్చని చెట్ల మధ్య పది నిమిషాలు ఉన్నా సరే, ఎంతో హాయిగా అనిపిస్తుంది. శరీరానికి చల్లగా తాకే స్వచ్ఛమైన గాలి మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇక చిన్న పిల్లల్లు పార్క్‌లు లేదా ఉద్యానవనాల్లో చాలా సంతోషంగా గడపడానికి ఇష్టపడుతారు. అది వారిలో మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఇక పిల్లల్లో ఎదుగుదల అనేది చాలా ముఖ్యమైనది. చిన్నారుల ఎదుగుదలకు, ఇమ్యూనిటీని పెంచడంలో పచ్చని చెట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే పచ్చని ప్రాంతంలో నివసించే పెద్దలు అధిక ఎముకల బలాన్ని కలిగి ఉంటారని గతంలో ఓ అధ్యయనంలో తేలిన విషయం తెలిసిందే. కాగా, ఓ కొత్త పరిశోధనలో నిపుణులు మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులోకి తీసుకొచ్చారు.

బాల్యంలో మానవ అస్తిపంజరం యొక్క అభివృద్ధి చాలా ముఖ్యమైనది, ఇది భవిష్యత్తులో ఎముక ఆరోగ్యానికి బలమైన పునాదిని ఏర్పరుస్తుంది.మన అస్తిపంజరం దృఢమైన, నిర్జీవంగా కనిపించినప్పటికీ, ఎముక అనేది జీవ కణజాలము , ఇది ప్రారంభ జీవితంలో క్రమంగా సాంద్రతను పెంచుతుంది. సమతుల్య పోషకాహారం, శారీరక శ్రమ, వ్యాయామం, మన ఎముకలను బలంగా ఉంచుతాయి. ఇవే కాకుండా ఆకుపచ్చ ప్రదేశాలు కూడా ఆ జీవనశైలిని సులభతరం చేయడంలో సహాయపడతాయంట.

మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రకృతికి సమీపంలో నివసించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. దీంతో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోని వైద్యులు తమ రోగులకు ప్రకృతి నడకలను సూచించడం ప్రారంభించారు. 3 మీటర్ల (దాదాపు 10 అడుగులు) ఎత్తులో ఉన్న వృక్ష సంపద కలిగిన పట్టణ, సబర్బన్ గ్రామీణ పచ్చని ప్రదేశాలు స్థానిక పిల్లల ఎముకల సాంద్రతను ఎలా ప్రభావితం చేశాయో పరిశోధకులు పరిశోధించారు.

పచ్చని ప్రదేశంలో నివసించే పిల్లలు, వారి తల్లుల ఆరోగ్యాన్ని పరిశీలించడా అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.గార్డెన్ లేదా ఫారెస్ట్ వంటి పచ్చటి ప్రదేశంలో నడక దూరంలో నివసించే పిల్లలు బలమైన,ఆరోగ్యకరమైన ఎముకలను కలిగి ఉంటారంట. బెల్జియంలోని హాసెల్ట్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు, పచ్చని ప్రదేశంలో నివసించే 4 నుంచి 6 సంవత్సరాల వయసు గల 327 మందిని పరీక్షించగా , వారిలో ఎక్కువ మంది అధిక ఎముక ఖనిజ సాంద్రతను కలిగిఉన్నారంట.

పచ్చటి ప్రదేశానికి అత్యంత సమీపంలో 10 నిమిషాల దూరంలో ఉన్న పిల్లల్లోతో పోలిస్తే 20 నిమిషాల నడక దూరంలో ఉన్న పిల్లలో ఎముక సాంద్రత 61 తక్కువగా ఉండే ప్రమాదం ఉన్నదన్నారు. గ్రీనరికి దగ్గరిగా ఉండే అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎముకల సాంద్రతను పెంచే విటమిన్ స్లిమింటేషన్, పాల వినియోగం అన్నీ సమానంగా ఉన్నాయంట. ఈ పరిశోధనలు దీర్ఘకాలిక సమస్యలు, పెరుగుదల , క్లిష్టమైన కాలంలో ఎముకల బలం, ఆరోగ్యంపై గ్రీన్ స్పెస్ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో తెలియజేస్తుందని హాసెల్ట్ విశ్వవిద్యాలయ పర్యావరణ ఎపిడెమియాలజిస్ట్ హన్నే స్లీర్స్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed