- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిగరెట్ తాగిన తర్వాత ఈ పండ్లు తిన్నారంటే.. ఎలాంటి హాని కలగదు
దిశ, ఫీచర్స్ : అతి ప్రమాదకరమైన అలవాటు ఏదైనా ఉందా అంటే సిగరెట్. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ చాలా మందికి ధూమపానం చేయకపోతే రోజు గడవదు. పెట్టెలకొద్దీ సిగరెట్లు కాల్చేస్తుంటారు. అలా సిగరెట్‌కు బానిసగా మారి ఆరోగ్యాన్ని కాల్చుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే చాలా మందిలో నిద్ర లేవగానే సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది. అది చాలా ప్రమాదకరం ఇతరులతో పోలిస్తే ఉదయాన్నే సిగరెట్ తాగేవారికి నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ విషయం ఒక అధ్యయనం ద్వారా కనుగొన్నారు పరిశోధకులు. మరి ఈ అలవాటును మానుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పాలి. ఎందుకంటే ఈ అలవాటు బ్రెయిన్ తో లాక్ అయి ఉంటుంది. సిగరెట్ బాగా అలవాటు ఉన్నవారికి ఒక దమ్ము కొడితే కానీ బుర్ర పని చేయదు. మరి ఈ పాడు సిగరెట్ మానలేని వారు ఆరోగ్యం పై ప్రభావం చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..
సిగరెట్ లేదా బీడీ తాగడం వల్ల నికోటిన్ అనే పదార్థం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. అది మీ ఆరోగ్యమును దెబ్బతీస్తుంది. మీరు ఒక్కసారి పొగ తాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజుల పాటు ఉంటుంది. మరి ధూమపానం చేసిన ఆ ప్రభావం మీ ఆరోగ్యం పై పెద్దగా పడకుండా ఉండాలంటే మీరు పొగ తాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.
మీరు సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలా మేలు చేస్తుంది. వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లో నికోటిన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గించగలదు. కనుక మీరు స్మోక్ చేసిన వెంటనే కొన్ని యాపిల్ ముక్కలు తినడం అలవాటు చేసుకోండి. ఆహారంలో వెల్లుల్లి చేర్చుకోండి ఇది మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దానిమ్మలో ఆంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి కనుక సిగరెట్ తాగిన వెంటనే మీరు కొన్ని దానిమ్మ గింజలు తినండి. శరీరానికి రక్త ప్రసన్న సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉన్నాయి. ఈ పండు తిన్న లేదా దాంతో జ్యూస్ చేసుకుని తాగిన చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ఒక క్యారెట్ తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అయితే చాలా మంది టీ.. సిగరెట్ కాంబినెషన్‌ని భాగా ఇష్ట పడతారు. కానీ ఊపిరితిత్తులను దెబ్బతీయకుండా చేయగల గుణాలున్న గ్రీన్ టీ లో ఉంటాయి. కనుక మామూలు టీ బదులు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి.
ఒకటి గుర్తుపెట్టుకోండి ధూమపానం వల్ల ఊపిరితిత్తుల్లో పడే ప్రభావాన్ని.. పైన చెప్పిన సలహాలు కొంత మాత్రమే తగ్గిస్తాయి.