తులసి నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

by samatah |   ( Updated:2023-02-14 04:47:29.0  )
తులసి నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కది ప్రత్యేక స్థానం. దైవంగా భావించబడే తులసి మొక్కలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే తులసి ఆకులను నీటిలో వేసుకుని తాగితే చాలా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు. అయితే మరి ఈ తులసి నీటిని ఎలా తీసుకోవాలి? అనేది చూద్దాం..

* రాత్రి పూట కొన్ని తులసి ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి ఉంచాలి. ఇక ఉదయాన్నే ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. అలాగే పొత్తి కడుపు సమస్యలు తగ్గుతాయి. అంతే కాదు ఈ ఆకులు ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం, పుల్లని త్రేనుపు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

* కొంత మందికి రోజులో రెండు సార్లు బ్రష్ చేసిన కూడా మౌత్ ఫ్రెష్‌గా అనిపించదు. అలాంటప్పుడు రాత్రి పూట కొన్ని తులసి ఆకుల్ని ఒక గ్లాసు నీటిలో వేసి, ఆ నీటితో ఉదయాన్నే పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన, నోటిలో ఏర్పడే పుండ్లు, నోటి పూత తగ్గుముఖం పడతాయి. అలాగే దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

* ఇక వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వ్యాపిస్తుంది. ఇలాంటప్పుడు కొన్ని తులసి ఆకులను నీళ్లలో వేసి, వేడి చేసి దానికి కొద్దిగా తేనెను కలిపి తీసుకున్నట్లయితే జలుబు, దగ్గు సమస్యలతో పాటు గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్‌కు మాత్రలు వాడటం కంటే.. ఇలా సాధారణంగా వచ్చే జ్వరాలు తగ్గించడానికి తులసి నీరు అద్భుతంగా పని చేస్తుంది.

* తులసి నీరు మన శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. తాజా అధ్యయనాల ప్రకారం రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించే గుణం తులసిలో ఉందని తేలింది.

* చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం మందులు వాడాలి, లేదంటే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. కాగా తాజాగా యూరినరీ ట్రాక్ ను క్రమబద్ధీకరించి మూత్ర సంబంధిత వ్యాధులను నయం చేసే శక్తి తులసికి ఉంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కనుక కిడ్నీ సమస్యతో బాధపడేవారు .. రోజు తులసి నీరు తీసుకుంటే మంచిది.

* యూరిక్ యాసిడ్ రోగులు 5 నుంచి 6 తులసి ఆకులను తీసుకుని కడిగి తర్వాత ఈ ఆకును ఎండుమిర్చి, దేశీ నెయ్యితో కలిపి తినాలి. ఇలా ఈ ఆకులు నిత్యం తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది..

* చర్మ సంబంధిత సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం తులసి ఆకులు నమలడం వల్ల, చర్మం మెరిసిపోతుంది. తులసి ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి శుభ్రపరుస్తాయి. మొటిమలను నివారిస్తాయి. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

* అయితే తులసి ఆకులతో కాక వాటి గింజలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో తులసి గింజలు కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి : ఉదయాన్నే టిఫిన్‌కు బదులు అన్నం తింటున్నారా?

Advertisement

Next Story

Most Viewed