- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెడిసిన్ ఎఫెక్టివ్‌గా పనిచేయాలా? అయితే మ్యూజిక్ వింటూ వేసుకోండి !
దిశ, ఫీచర్స్ : మీరు వాడుతున్న మెడిసిన్ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే మాత్రలు వేసుకునేటప్పుడు మీకు ఇష్టమైన మ్యూజిక్ లేదా పాట వినడం ఇందుకు సహాయపడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. గత పరిశోధనలు కూడా నొప్పి, ఆందోళన వంటి సమస్యలకు చికిత్స చేయడానికి సంగీతం వినిపించే పద్ధతిని అనుసరించినట్లు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం కీమో థెరపీ వంటి చికిత్సలలో అది ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు యూఎస్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన వైద్య నిపుణుల బృందం స్టడీ చేసింది. మ్యూజిక్ లేదా పాట వినడం అనేది ఓవర్-ది-కౌంటర్ మెడికేషన్ వంటిదని యూఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ జాసన్ కీర్నాన్ అన్నారు.
నాడీ వ్యవస్థ ఉత్తేజితం
నొప్పి, ఆందోళన రెండు కూడా నాడీ సంబంధిత సమస్యలు. ఇవి బ్రెయిన్‌తో అనుసంధానం కలిగి ఉంటాయి. కీమోథెరపీ-ప్రేరిత వికారం కూడా నాడీ సంబంధితమైనదని పరిశోధకుడు కీర్నన్ పేర్కొన్నాడు. నిపుణులు కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న 12 మంది రోగులకు మెడిసిన్ తీసుకోవాల్సిన ప్రతీసారి 30 నిమిషాల పాటు వారికి ఇష్టమైన సంగీతాన్ని వినడానికి అవకాశం కల్పించారు. దీనివల్ల మెడిసిన్ ఎఫెక్టివ్‌గా పనిచేసిందని గ్రహించారు. సంగీతం విన్నప్పుడు మెదడు అన్ని రకాల న్యూరాన్స్‌ను ఉత్తేజరుస్తుందని, ఎఫెక్టివ్‌గా పనిచేసేలా చేస్తుందని, మందుల వల్ల కలిగే వికారం, బాధలు తగ్గుతాయని చెప్పారు. దీర్ఘకాలంపాటు మెడిసిన్ వాడాల్సినవారు వాటిపై విరక్తి పుట్టడం, వికారం కారణంగా ఇబ్బంది పడకుండా ఇష్టమైన సంగీతాన్ని వింటూ మెడిసిన్ వేసుకునే నాన్‌ఫార్మాకోలాజికల్ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది.
Also Read..