- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Fake Friends: ఫేక్ ఫ్రెండ్స్‌ని కనిపెట్టండిలా..?
దిశ, ఫీచర్స్: ప్రతి రోజూ చాలామందిని మనం కలుస్తుంటాము. వారిలో కొందరు మనకు స్నేహితులు అవుతారు. కానీ, నిజమైన స్నేహితులు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. మంచి స్నేహితులు ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో స్నేహితుడిని ఎంచుకునే విషయంలో తప్పులు చేస్తారు. నిజమైన స్నేహితుడు ఎలాంటి పరిస్థితులలోనైనా సహాయం చేస్తాడు. జీవితంలో ఎదగడానికి చేయూతనిస్తాడు. కానీ, కొందరు మాత్రం స్నేహం పేరుతో నటిస్తుంటారు. అలాంటి వారిని నమ్మితే మోసపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనతో ఉన్న వారు నిజమైన స్నేహితులా..?కాదా? అనేది ఈ లక్షణాలు ఆధారంగా తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ప్రతీ ఒక్కరికీ ఎంతో మంది స్నేహితులు ఉంటారు. కానీ, వారందరిలో కొద్ది మంది మాత్రమే నిజమైన స్నేహితులు ఉంటారు.
కష్టకాలంలో తోడుగా: నిజమైన స్నేహితుడు సంతోషంలోనే కాదు బాధల్లోనూ తోడుగా ఉంటారు. కష్టకాలంలో బాధల్ని అర్థం చేసుకుని, మీకు అండగా ఉంటారు. మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. నకిలీ స్నేహితులు మాత్రం కష్ట సమయంలో మీకు దూరంగా ఉంటారు. ఆ సమయంలో వారిని సంప్రదించాలని అనుకున్నా.. వివిధ కారణాలు చెప్పి తప్పించుకుంటారు.
టైం ఇస్తారు: స్నేహం అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది కేవలం పార్టీలు, సినిమాలు, కాలక్షేపానికి మాత్రమే పరిమితం కాదు. ఎంత బిజీగా ఉన్నా సరే మీకు ఏమైనా కష్టం వచ్చిందంటే మిమ్మల్ని ఆదుకుంటారు. ఆ కష్టాన్ని అధిమించడానికి తనవంతు సాయం చేస్తారు. అంటువంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు అవుతాడు. ఫేక్ ఫ్రెండ్ అయితే మాత్రం ఫోన్ ఎత్తకపోవడం, బిజీగా ఉన్నానని చెప్పడం వంటివి చేస్తుంటాడు.
బాధపెట్టడం: నకిలీ స్నేహితులు నిజాలు చెబుతున్నామంటూ ప్రతీ విషయంలోనూ బాధపెడుతుంటారు. మనసు నొచ్చుకునేలా మాట్లాడుతారు. ఇతరులు ఉన్నా కూడా ఏ మాత్రం ఆలోచించకుండా విమర్శిస్తుంటారు. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు మనం బాధపడేటప్పుడు లోలోపల సంతోషపడుతూ ఉంటారు.
మంచిని చెబుతాడు: నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కూడా మీ శ్రేయస్సునే కోరుకుంటాడు. మీ బలాన్ని మాత్రమే కాదు మీ లోపాల గురించి కూడా చెబుతుంటాడు. మంచి కోరుకునే స్నేహితుడు అద్దంలా ఉంటాడు. తప్పు చేసినప్పుడు తప్పనే చెబుతాడు. అదే ఫేక్ ఫ్రెండ్ అయితే, మీరు తప్పులు చేసినా మిమ్మల్ని పొగుడుతూ ఉంటాడు. మీరు చేసిన పని ఏదైనా సరే కరెక్ట్ అని చెబుతారు. నిజమైన స్నేహితుడు మాత్రం ఎప్పుడూ నిజాతీగా ఉంటాడు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.