- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల.. 60 శాతం మరణాలపై ప్రభావం
దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పుల కారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ భవిష్యత్ మరణాల సంఖ్య దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ, యూఎస్ పరిశోధకుల ప్రకారం.. ఉష్ణోగ్రతల కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 60 శాతం మేర పెరుతుందని అంచనా వేయబడింది. రాత్రిపూట పరిసరాల్లోని వేడి పరిస్థితులు నిద్రకు అంతరాయాన్ని కలిగిస్తాయని, తద్వారా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని హృదయ సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని ఈ అధ్యయనం తెలిపింది.
'రోజువారీ సగటు ఉష్ణోగ్రతలో 20 శాతం కంటే తక్కువ పెరుగుదలతో పోలిస్తే.. 2100 వరకు వేడి రాత్రుల ఫ్రీక్వెన్సీ 30 శాతం, సగటు తీవ్రత 60 శాతానికి పెరుగుతుందని గిల్లింగ్స్ స్కూల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఇంజనీర్ డిపార్ట్‌మెంట్ సైంటిస్ట్ జాంగ్ చెప్పారు. 2090 నాటికి హాట్ నైట్ ఈవెంట్స్ సగటు తీవ్రత తూర్పు ఆసియాలోని 28 నగరాల్లో 20.4 డిగ్రీల సెల్సియస్ నుంచి 39.7 డిగ్రీల సెల్సియస్‌కు అంటే దాదాపు రెట్టింపు అవుతుందని, సాధారణ నిద్రా విధానాలకు అంతరాయం కలిగించే అధిక వేడి వల్ల వ్యాధి భారం పెరుగుతుందని ఫలితాలు చూపిస్తున్నాయి.
1980 నుంచి 2015 మధ్య కాలంలో చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లోని 28 నగరాల్లో అధిక వేడి కారణంగా మరణాల రేటు అంచనా వేయబడింది. తద్వారా కార్బన్-తగ్గింపు దృశ్యాలకు అనుగుణంగా రెండు వాతావరణ మార్పుల మోడలింగ్ దృశ్యాలకు వీటిని వర్తింపజేసింది. ఈ మోడలింగ్ ద్వారా 2016 నుంచి 2100 మధ్య అధిక వేడి రాత్రుల కారణంగా మరణించే ప్రమాదం దాదాపు ఆరు రెట్లు పెరుగుతుందని బృందం అంచనా వేయగలిగింది. అధ్యయనంలో మూడు దేశాల నుంచి 28 నగరాలు మాత్రమే ఉన్నాయి. అయితే 'ఈ ఫలితాలు మొత్తం తూర్పు ఆసియా లేదా ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి' అని జాంగ్ చెప్పారు.
రాత్రి ఉష్టోగ్రతలతో పెరుగుతున్న మరణాలు.. స్టడీలో షాకింగ్ అంశాలు!
ఆ టైమ్‌లో మెలకువగా ఉండటానికి మానవ మెదడు అనువైనది కాదు..?!