వేడి ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?.. పెడితే ఏం జరుగుతుంది?

by Javid Pasha |   ( Updated:2024-08-28 11:31:54.0  )
వేడి ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?.. పెడితే ఏం జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో ప్రతీ ఇంటిలో ఫ్రిజ్ వాడుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, వివిధ ఆహార పదార్థాలు ఒకటికంటే ఎక్కువరోజులు నిల్వ ఉండటానికి అందులో పెడుతుంటారు. అయితే వేడి పదార్థాలు కూడా ఫ్రిజ్‌లో పెట్టవచ్చా?, పెడితే ఏం జరుగుతుంది? నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

టెంపరేచర్ పెరుగుతుంది

వేడి వేడి పదార్థాలు నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడంవల్ల దానిలోపల ఉష్ణోగ్రత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఇన్‌సైడ్ టెంపరేచర్ 4 °C (39 °F)గా ఉంటుంది. అయితే వేడి చేసిన ఆహార పదార్థాలు పెట్టడంవల్ల ఇది అస్థిరంగా మారుతుంది. పైగా ఫ్రిజ్ త్వరగా పాడయ్యే చాన్స్ ఉంది.

ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి

వేడిగా పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టడం కారణంగా లోపలి టెంపరేచర్‌లో అసమతుల్యత ఏర్పడుతుంది. దీని కారణంగా ఫ్రిజ్‌కు డ్యామేజ్ కావడమే కాకుండా పెట్టిన పదార్థాలు కూడా త్వరగా పాడవుతాయి. ఇక ఫ్రిజ్ లోపలి భాగంలో 4 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉంటే గనుక.. అందులో పెట్టిన ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, వివిధ సూక్ష్మ క్రిములు చేరుతాయి. ఇవి రోగ్యాల వ్యాప్తికి కారణం కావచ్చు.

రుచి, నాణ్యత మారుతాయి

వేడి ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టాక ఆ తర్వాత వాటిని తిన్నా అంత రుచిగా ఉండవు. వాటిలోని పోషకాలు, నాణ్యత లోపిస్తాయి. అంతే కాకుండా వేడి ఆహారాలు ఫ్రిజ్ వెంటిలేషన్ సిస్టమ్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతాయి. దీంతో ఫ్రిజ్ ఎనర్జీ వినియోగం కూడా పరుగుతుంది. వాతావరణ కాలుష్యానికి, ఫ్రిజ్ జీవితకాలం తగ్గడానికి కారణం అవుతాయి.

ఇతర పదార్థాలు కూడా పాడవుతాయి

వేడి పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు లోపల జరిగే చర్యలవల్ల అందులో ఉండే ఇతర చల్లటి ఆహార పదార్థాలు కూడా త్వరగా పాడవుతాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆహారం వేడిగా ఉంటే ఫ్రిజ్‌ లోపల ఆవిరి, తేమ ప్రొడ్యూస్ అవుతాయి. వీటి ప్రభావంవల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్స్ ఏర్పడవచ్చు. కాబట్టి చల్లారిన పదార్థాలనే ఫ్రిజ్‌లో పెట్టాలంటున్నారు నిపుణులు.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

More News : ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గితే శరీరంలో జరిగే మార్పులివే.. ఆ తర్వాత క్రమంగా

Advertisement

Next Story

Most Viewed