ఏఐ సృష్టించిన హైయెస్ట్ శాలరీ జాబ్స్... భారీ డిమాండ్...

by Sujitha Rachapalli |   ( Updated:2024-09-18 15:09:24.0  )
ఏఐ సృష్టించిన హైయెస్ట్ శాలరీ జాబ్స్... భారీ డిమాండ్...
X

దిశ, ఫీచర్స్ : ఇక AI రాజ్యం వస్తుందనే భయం ఇప్పటికే మొదలైంది. చాలా దేశాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో తామే ముందుండాలని పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో AI బేస్డ్ కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఐదు ఉద్యోగాలకు హైయెస్ట్ జీతాలు అందించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు నిపుణులు.

ఏఐ ఇంజినీర్

ఏఐ ఇంజినీర్ లేదా స్పెషలిస్ట్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అండ్ అప్లికేషన్స్ రూపొందించడానికి, శిక్షణ అందించడానికి పని చేస్తారు. స్మార్ట్ సిమ్ లను క్రియేట్ చేసే వీరు...AI టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ లో పాల్గొంటారు. కొత్త AI బేస్డ్ టూల్స్ రూపొందించడానికి అవసరమైన అల్గారిథమ్స్ రాసేందుకు.. API లను ఉపయోగించేందుకు కంపెనీలు వీరి కోసం సెర్చ్ చేస్తున్నాయి.

AI ఎథిసిస్ట్

ఈ వ్యక్తి AI ఎలా ఉపయోగించబడుతుందో చెక్ చేస్తాడు. దాని చట్టపరమైన, నైతిక, సామాజిక ప్రభావాల గురించి ఆలోచిస్తాడు. AI బాధ్యతాయుతమైన డెవలప్మెంట్.. ఉపయోగం కోసం మార్గదర్శకాలు సెట్ చేస్తాడు. కంపెనీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఫైర్ గా, బయాస్డ్ గా లేకుండా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేస్తాడు.

AI ప్రొటెక్షన్ అనలిస్ట్

ప్రొటెక్షన్ అనలిస్ట్ రోల్.. కంపెనీ మేధో సంపత్తిని రక్షించడం, దుర్వినియోగం కాకుండా నిరోధించడంతో ముడిపడి ఉంటుంది. ఫైనాన్షియల్ AI టూల్స్ వ్యక్తిగత డేటాను ప్రైవేట్ గా, సెక్యూర్ గా ఉంచుతుందో లేదో నిర్ధారించుకోవాలి. ప్రైవసీ నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది.

AI సొల్యూషన్స్ అనలిస్ట్

బిజినెస్ కార్యకలాపాలను మెరుగుపరుకోవడానికి AIని ఉపయోగించేందుకు సొల్యూషన్స్ అనలిస్ట్ రోల్ అత్యవసరం కానుంది. ఇతను కన్సల్టెంట్ గా వ్యవహరిస్తాడు. AI బిజినెస్ ప్రక్రియలను ఎలా వేగంగా, చౌకగా, మరింత సమర్థవంతంగా చేయగలదో గుర్తించడంలో కంపెనీకి సహాయం చేస్తాడు.

Advertisement

Next Story