Health Tips : గోర్లపై తెల్ల మచ్చలు.. ఎందుకొస్తాయో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-08-01 10:00:36.0  )
Health Tips : గోర్లపై తెల్ల మచ్చలు.. ఎందుకొస్తాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: అందంగా కనిపించేందుకు గోర్లను పెయింటింగ్ చేయడం, అలంకరించడాన్ని చాలా మంది ఇష్టపడతారు. కానీ వాటి పరిశుభ్రత గురించి అంతగా పట్టించుకోరు. కొన్నిసార్లు నెయిల్స్ కలర్ మారినా గుర్తించరు. వైట్ స్పాట్స్ రావడం, పెళుసుగా మారడాన్ని విస్మరిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సూచికలు అని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆరోగ్యకరమైన గోర్లు ఎలా కనిపిస్తాయి? ప్రమాదానికి సంకేతమని ఎలా తెలుసుకోవచ్చు? అనే విషయాల గురించి చర్చిద్దాం.

ఆరోగ్యకరమైన గోర్లు సాధారణంగా గులాబీ రంగులో ఉంటాయి. కొన వద్ద కొంచెం వంపు ఉంటుంది. రంగు, ఆకృతిలో మార్పు పోషక లోపాలు, అంటువ్యాధులు లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. హెయిర్ మాదిరిగానే గోర్లు కెరాటిన్‌తో తయారు చేయబడ్డాయి. ప్రొటీన్ లేకుండా గోళ్లు పెళుసుగా, నిస్తేజంగా, పొడిగా మారతాయి. సంవత్సరానికి సగటున గోర్లు ఒక అంగుళం, అర అంగుళం పెరుగుతుండగా.. ఈ పెరుగుదల రేటు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. వయస్సు, గర్భం, రుతువులు వాటి వృద్ధి రేటును ప్రభావితం చేయవచ్చు.

గోరు ఆకారం:

ఆపోజిట్ డైరెక్షన్‌లో నెయిల్ కర్వింగ్స్ దీర్ఘకాలిక ఐరన్ లోపం రక్తహీనతను సూచిస్తాయి. టిప్స్ కింద వంకరగా ఉన్నట్లయితే శ్వాసకోశ లేదా గుండె సమస్యలకు సంకేతంగా ఉంటుంది. అయితే బేస్ వద్ద పెరిగిన గోర్లు శ్వాసకోశ ఇబ్బందులను సూచిస్తాయి. హార్మోన్ల రుగ్మత వల్ల గోర్లు చతురస్రాకారంలో, వెడల్పుగా మారవచ్చు. ఇక చదునైన, సన్నని గోర్లు తగినంత విటమిన్ B12ను సూచిస్తాయి. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి విటమిన్ B12 సమృద్ధిగా ఉండే ఆహారాలు, ఆకుపచ్చ ఆకు కూరలు, గింజలు వంటి ఐరన్-రిచ్ మూలాలతోపాటు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం ఇనుము శోషణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

నెయిల్స్ పీలింగ్:

కెరాటిన్ యొక్క రక్షిత పొరలు దెబ్బతిన్నప్పుడు గోర్లు పీల్ అవుతాయి. రక్షణ లేకుండా వేడి, గాలి, నీరు లేదా చల్లని గాలికి గురికావడం గోరు పొట్టుకు దారితీస్తుంది. ఈ పరిస్థితి తరచుగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపాన్ని సూచిస్తుంది. వాల్‌నట్‌లు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం వంటి ఒమేగా అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చడం వల్ల తేమ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే, లోషన్‌తో చేతిని మాయిశ్చరైజ్ చేయడం వల్ల గోరు పొరలు మృదువుగా మారుతాయి.

పసుపు గోర్లు:

గోర్లు పసుపు రంగులోకి మారడం మధుమేహం, శ్వాసకోశ లేదా కాలేయ సమస్యల వంటి వివిధ అంతర్గత రుగ్మతలకు ముందస్తు సంకేతం. గోళ్ళపై పసుపు మచ్చలు ఫంగస్ లేదా సోరియాసిస్‌కు సూచికలు కావచ్చు.

పెళుసుదనం:

చాలా మంది గోర్లు పెళుసుగా ఉంటాయి. దీంతో తేమ తగ్గిపోయి, సులభంగా ఆరిపోతాయి. పగుళ్లకు గురవుతాయి. లో-యాక్టివ్ థైరాయిడ్ తరచుగా పెళుసుగా ఉండే గోర్లతో సంబంధం కలిగి ఉంటుంది. ఆహారంలో కాల్షియం, ప్రొటీన్లు తగినంతగా తీసుకోకపోవడం కూడా గోర్లు బలహీనంగా, పెళుసుగా మారడానికి దోహదం చేస్తుంది. మెంతి, నాచిని, చేపలు, ఆకు కూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు.

తెల్లని మచ్చలు:

తెల్లటి గీతలు, మచ్చలు కూడా సాధారణమే. ఇది జ్వరం, కాలేయం, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్య లేదా ఎక్కువగా ఇనుము, జింక్ లేకపోవడం వంటి వాటికి సంకేతం కావచ్చు. తామర వంటి సంక్లిష్ట సమస్యలను సూచించవచ్చు. ఇలాంటప్పుడు ఎండిన బీన్స్, పాల ఉత్పత్తులు, చికెన్ బ్రెస్ట్, ఎండుద్రాక్ష, బఠానీలు, వోట్మీల్ మొదలైనవి తీసుకోవాలంటున్నారు నిపుణులు.

టర్నింగ్ కలర్స్:

గోర్లు అనారోగ్యకరమైన రంగు పొందడానికి ప్రధాన కారణాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకటి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ గోరును బేస్ నుంచి వేరు చేస్తుంది. అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రభావితమైన గోరు కొద్దిగా ఆకుపచ్చగా మారడానికి కారణమవుతుంది. బ్లూసిహ్ నెయిల్‌బెడ్స్ ఊపిరితిత్తుల సమస్యకు సంకేతం.

గోరు ఆకృతి:

గోరుపై కనిపించే నిలువు చీలికలు ఇనుము లోపం, విటమిన్లు, పోషకాల పేలవమైన శోషణ, పేలవమైన ఆరోగ్యం లేదా మూత్రపిండాల సమస్యలను సూచిస్తాయి. ఎగుడుదిగుడుగా ఉండే గోర్లు ఆర్థరైటిస్ ప్రమాదాన్ని సూచించవచ్చు.

Also Read: రాత్రి పూట పాలల్లో ఇది కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed