కళ్లు పచ్చగా మారాయా? హెపటైటిస్–ఎ కావచ్చు

by sudharani |   ( Updated:2023-03-23 13:27:37.0  )
కళ్లు పచ్చగా మారాయా? హెపటైటిస్–ఎ కావచ్చు
X

దిశ, ఫీచర్స్: వైరస్ కారణంగా కాలేయంలో వాపు రావడం, కళ్లు పసుపు పచ్చగా మారడాన్ని హెపటైటిస్-ఎ వ్యాధిగా పరిగణిస్తారు. దీనిని “వైరల్ హెపటైటిస్” అని కూడా పిలుస్తారు. కలుషితమైన ఆహారం లేదా నీటివల్ల ఇది వస్తుంది. వ్యాధి సోకిన వారిని తాకటం, ముద్దుపెట్టుకోవడం ద్వారా కూడా వస్తుంది. వైరస్ శరీరంలో ఉన్నప్పటికీ లక్షణాలు త్వరగా బయటపడవు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 15 నుంచి 45 రోజుల మధ్య సదరు వ్యక్తిలో మార్పులు కనిపిస్తాయి.

బాధితుల శరీరం, కళ్లు పసుపు రంగులోకి మారడం మినహా మిగతా లక్షణాలన్నీ “ఫ్లూ” జ్వరం లక్షణాలను పోలి ఉంటాయి. బాడీలో రక్తంలోని ‘బిల్రుబిన్‌’ను లివర్ ఫిల్టర్ చేయకపోవడంవల్ల ఇలా జరుగుతుంది. హెపటైటిస్ వైరస్ అంటువ్యాధుల్లో హెపటైటిస్–ఎ, బి, సి లు అని మూడు రకాలుంటాయి. వీటిల్లో పెద్దగా ప్రమాదం లేనిది హెపటైటిస్-ఎ మాత్రమే, హెపటైటిస్ బి, సిలు దీర్ఘకాలిక వ్యాధులుగా మారి ఇబ్బంది కలిగిస్తాయి.

లక్షణాలు

కామెర్లవల్ల కళ్లు పసుపు రంగులోకి మారడం, నీరసం, ఆకలి మందగించడం, వికారం, వాంతులు, జ్వరం, మలం బంకమట్టి రంగులో రావడం, దురద వంటి లక్షణాలు హెపటైటిస్-ఎ బాధితుల్లో కనిపిస్తాయి.

నివారణ

పరిశుభ్రమైన ఆహారం, నీటిని తీసుకోవడం, మల మూత్ర విసర్జన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం చేయాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, లేదా డాక్టర్లు ఈ వ్యాధి కలిగినవారి రక్తం, చెమట, ఇతర శారీరక ద్రవాలను తాకిన వెంటనే చేతులను సబ్బుతో కడుక్కోవాలి.

ప్రజలు ఎక్కువగా గుమిగూడె ప్రదేశాల్లో ఉండాల్సి రావడం మూలంగాను ఇది వ్యాపిస్తుంది. బయటి ప్రదేశాల్లో ఆహారం వడ్డించటానికి ముందు, విశ్రాంతి గదిని వాడుకున్న తర్వాత రెండు చేతులను బాగా శుభ్రంగా కడుక్కోవడంవల్ల ఈ వ్యాధి సామూహిక సంక్రమణను నిరోధించవచ్చు.

వ్యాక్సిన్లు

హెపటైటిస్–ఎ వ్యాధి గ్రస్తులతో సన్నిహితంగా మెలిగే అవకాశం ఉన్నవారు ఇమ్యున్ గ్లోబులిన్ మెడిసిన్స్ లేదా వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్లు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. ఫస్ట్ డోస్ తీసుకున్న 4 వారాల తర్వాత నుంచి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. వ్యాధి నుంచి సుదీర్ఘకాలం రక్షణ పొందాలంటే 6 నుంచి 12 నెలల బూస్టర్ డోసును తీసుకోవడం బెటర్ అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌.

Also Read...

ఏం చేస్తే మనం కూడా మేధావులం అవుతాం...?

Advertisement

Next Story

Most Viewed