- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Heart attack: గుండెపోటు ఒకసారి వచ్చి తగ్గాక.. మళ్లీ మళ్లీ వస్తుందా?.. ఒక వ్యక్తి ఎన్నిసార్లు తట్టుకోగలడు?
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏజ్‌బార్ వ్యక్తులకే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ.. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఫిజికిల్ యాక్టివిటీస్ లేకపోవడం వంటివి కూడా కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇటీవల గుండె పోటు కేసులు పెరుగుతుండటంవల్ల పలువురు సోషల్ మీడియా వేదికగా దాని గురించి చర్చిస్తున్నారు. హార్ట్ ఎటాక్ ఒకసారి వస్తే మళ్లీ మళ్లీ వస్తుందా?, ఒక వ్యక్తి దానిని ఎన్నిసార్లు తట్టుకోగలడు? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం.
నిజానికి గుండెపోటు చాలా తీవ్రమైన సమస్య. ప్రధానంగా అధిక కొవ్వు, అధిక రక్తపోటు ఇందుకు కారణం అవుతాయి. చెడు కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోవడం కారణంగా రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఆ క్షణంలో గుండెకు రక్తం అందకపోవడంవల్ల వెంటనే గుండెపోటు వస్తుందని ఆరోగ్య హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే గుండె కండరాలు దెబ్బతిని మరణం సంభవించే అవకాశం ఉంటుంది.
ఒక వ్యక్తికి ఎన్నిసార్లు వస్తుంది?
సాధారణంగా గుండెపోటుకు ప్రధాన కారణం ధమనుల్లో బ్లడ్ సర్క్యులేషన్‌కు ఏర్పడే ఆటంకం అనే విషయం తెలిసిందే. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో మూడు సార్లు గుండెపోటుకు గురయ్యే చాన్స్ ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక పేర్కొంటున్నది. అయితే ఒకసారి గుండెపోటుకు గురైన బాధితుల్లో వివిధ కారణాలవల్ల సెకండ్ అండ్ థార్డ్ టైమ్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే మొదటి, రెండవసారి గుండెపోటు సమయంలో వెంటనే ట్రీట్మెంట్ అందించడం, ఆ తర్వాత జీవన శైలిలో మార్పుల కారణంగా బాధిత వ్యక్తులు కోలుకొని.. సాధారణంగా జీవించే అవకాశం ఉంటుంది. కానీ మూడవసారి వస్తే మాత్రం గుండె కండరాలు దెబ్బతినడంవల్ల బతికే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. సరైన సమయంలో చికిత్సవల్ల మూడవసారి గుండెపోటు తర్వాత కూడా కోలుకుంటున్న సందర్భాలు ఇటీవల పెరుగుతున్నాయి. ఇక నాలుగవసారి గుండెపోటు రావడం మాత్రం ప్రాణాంతకమే కావచ్చు. ఈ సమయంలో బతికే అవకాశాలు దాదాపు ఉండవని హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. అందుకే గుండెపోటు రాకుండా ఉండేందుకు అవసరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్
గుండెపోటు వచ్చే ముందు సాధారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని బట్టి వెంటనే అలర్ట్ అయితే.. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణహాని తప్పుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఛాతీలో తీవ్రమైన నిప్పిని, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉండవచ్చు. ఆ క్షణంలో తమకు ఏదో జరుగుతుందనే బయం కూడా బాధితుల్లో కనిపిస్తుంది. ఇలాంటప్పుడు వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎడమచేయి, మెడ భాగాల్లో నొప్పి, తిమ్మిరి వంటివి సంభవిస్తాయి. శ్వాసలో ఇబ్బంది మొదలై క్రమంగా పెరుగుతూ వస్తుంది. శరీరంలో చెమట రావడం పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలు కాబట్టి వెంటనే అప్రమత్తమై డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నివారణ ఎలా?
సమస్యకు కారణం ఏమిటో తెలిసినప్పుడు నివారణ కూడా సులువే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రధానంగా నిశ్చల జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని, శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచే ఆహారాలను తగ్గించుకోవాలని చెప్తున్నారు. అలాగే మధుమేహాన్ని, బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఈ విధమైన అలవాట్లు గుండెపోటు నివారణలో భాగంగా చక్కటి ప్రయోజనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించగలరు.