Health with Amla : ఎండు ఉసిరిలో పోషకాలు మెండు.. తింటే ఆ వ్యాధులన్నీ పరార్..!

by Javid Pasha |
Health with Amla : ఎండు ఉసిరిలో పోషకాలు మెండు.. తింటే ఆ వ్యాధులన్నీ పరార్..!
X

దిశ, ఫీచర్స్ : ఉసిరి ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. కానీ ఎండు ఉసిరి వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. మధుమేహం సహా పలు ఇతర వ్యాధులకు సహజ నివారిణిగా పనిచేస్తుందని చెప్తున్నారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు మెండుగా ఉండటంవల్ల శరీరానికి మేలు చేస్తుంది.

* విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఎండు ఉసిరిలో ఇది పుష్కలంగా లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంవల్ల గాయాల సమయంలో రక్తస్రావాన్ని అరికడుతుంది. యాసిడ్ రిఫ్లెక్స్‌గా పనిచేయడంవల్ల హార్ట్‌ బర్న్ సమస్యను తగ్గిస్తుంది. ఫైబర్ ఉన్నందున మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ప్రేగుల ఆరోగ్యానికి కూడా మంచిది.

* యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి ఎండు ఉసిరి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడకుండా అడ్డుకుంటుంది. అలాగే ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. చుండ్రు నివారణిగా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ముఖంపై ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. స్మూతీస్, జ్యూస్ రూపంలో కూడా ఎండు ఉసిరిని తీసుకోవచ్చు. అలాగే పెరుగులో కలుపుకొని తాగవచ్చు. టాబ్లెట్స్ రూపంలోనూ లభిస్తాయి. అయితే అతిగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలకు దారితీయవచ్చు. కాబట్టి మితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story