- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
health tips: అలా ఉన్నప్పుడు ఉల్లిపాయను తినవచ్చా?.. చాలా మంది చేసే పొరపాటు ఇదే..
దిశ, ఫీచర్స్ : మనం రోజువాడే నిత్యావసర వస్తువుల్లో ఉల్లిపాయలు ఒకటి. నిజానికి ఇవి లేకుండా ఆహారం రుచికరంగా ఉండదు. తగిన పోషకాలు కూడా లభించవు. కూరల్లో, స్నాక్స్‌లో, సలాడ్‌లో కూడా వీటిని కలిపి తీసుకుంటారు. ఏ రూపంలో తిన్నా ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. అయినప్పటికీ వీటిని తీసుకోకూడని సందర్భాలు కూడా ఉంటాయి. ఆ వివరాలేంటో చూద్దాం.
* ఉల్లి పాయల్లో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, సోడియం, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటివి ఉంటాయి. కాబట్టి పచ్చివైనా, కాల్చినవైనా, వంటలో వాడటంవల్ల అయినా.. ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచిదే. జీర్ణశక్తిని మెరుగు పర్చడంతోపాటు అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఉల్లిపాపయలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యను నివారించడంలోనూ, క్యాన్సర్ రిస్కును తగ్గించడంలోనూ ఉల్లిపాయలు సహాయపడతాయి.
* ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఉల్లిపాయను తినకూడని సందర్భాలు కూడా ఉంటాయి. ఎప్పుడంటే.. వాటిని కోసినప్పుడు లోపల నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. వాస్తవానికి అది బ్లాక్ ఫంగస్. దీనిని చూసుకోకుండా అలాగే తినేసినా, వంటకంలో వాడినా కడుపులో ఉబ్బరం, అసౌకర్యం వంటి ఇతర సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్‌కు దారితీయవచ్చు. కాబట్టి అలా ఉన్నప్పుడు తినకూడదు. అయితే ఈ బ్లాక్ ఫంగస్‌ను పూర్తిగా తొలగించి ఉల్లిపాయను వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.