రాత్రిపూట తినడం మానేస్తున్నారా..?

by samatah |   ( Updated:2023-03-29 10:10:41.0  )
రాత్రిపూట తినడం మానేస్తున్నారా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరూ, చాలా మంది ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు. కానీ కొంత మంది తాము చేసే చిన్న చిన్న తప్పుల వలన అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు.

ఎలా అంటే? కొంత మంది డైటింగ్ చేస్తారు, మరికొంత మంది కావాలనే తినడంలో నిర్లక్ష్యం చేస్తారు. అయితే రాత్రిపూట తినకపోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయంట. రాత్రిపూట భోజనం మానేస్తే .. అది మీ శారీరక ,మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అంటున్నారు వైద్యులు. అంతేకాకుండా అది మిమ్మల్ని డిప్రెషన్ బాధితురాలిగా మారుస్తుందంట.

అలాగే రాత్రిపూట భోజనం మానేయడం వలన ఆందోళనను పెరిగి ,రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్ల మొత్తాన్ని పెంచడం ప్రారంభిస్తుంది. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట. అంతే కాకుండా నిద్రలేమి వంటి సమస్యలు బాధిస్తాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.

ఇవి కూడా చదవండి: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా.. అయితే అవి మీ పునర్జన్మ జ్ఞాపకాలే..

Advertisement

Next Story