- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లిపాలు అందని శిశువుల్లో తగ్గుతున్న ఇమ్యూనిటీ పవర్.. ఏం చేయాలో తెలుసా?
దిశ, ఫీచర్స్: తల్లిపాలే బిడ్డకు బలమని, కనీసం ఆరు నెలల వరకైనా శిశువుకు బ్రెస్ట్ ఫీడింగ్ కచ్చితంగా ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. చిన్నప్పుడు మదర్ ఫీడింగ్‌కు దూరమైన పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటివి జరుగుతుంటాయి. అయితే కొందరు తల్లులు బిడ్డకు ఇవ్వడానికి సరిపడా పాలు ఉత్పత్తికాకపోవడంవల్ల ఇబ్బంది పడుతుంటారు. తీసుకునే ఆహారంలో తగిన పోషకాలు లేకపోవడం ఇందుకు కారణం అవుతుంది. అందుకే బాలింతలు తగిన పౌష్టికాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శిశువు ఆరోగ్యానికి తల్లి ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. శిశువులకు పాలిచ్చే తల్లులకు అధిక మొత్తంలో పోషకాహారం అవసరం. సాధారణ రోజులకంటే కూడా బాలింతలుగా ఉన్నప్పుడు ప్రతిరోజు అదనంగా 330 నుంచి 400 కిలో కేలరీల అదనపు పోషకాలు తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అందుకే ప్రోటీన్లు, కాల్షియం విరివిగా ఉండే సోయా, చిక్కుళ్లు, కాయ ధాన్యాలు, తృణ ధాన్యాలు, మాంసం, గుడ్లు తీసుకోవాలి.
ఆకు పచ్చ కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలి. జింక్ ఐరన్ కలిగి ఆహారం వల్ల తల్లిపాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఇవి లభించే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చికెన్, చేపలు, మొలకెత్తిన గింజలు, బీన్స్, డ్రై ఫ్రూట్స్, పాస్తా వోట్స్ మీల్స్, ఒమేగా 3 పోషకాలు కలిగిన సాల్మన్, బ్లూ ఫిష్, బాస్, ట్రౌట్, ట్యూనా కనీసం వారానికి రెండు నుంచి మూడుసార్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More: దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా?