Head Bath: రోజూ తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ అవుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

by Kavitha |
Head Bath: రోజూ తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ అవుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది ప్రతిరోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. అందులో మగవారు అయితే హెయిర్ చిన్నగా ఉంటుంది కాబట్టి డైలీ చేస్తుంటారు. కానీ ఆడవాళ్ల జుట్టు పొడుగ్గా ఉండడం వల్ల వారానికి రెండు మూడు సార్లు అయినా చేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల చాలా మంది జుట్టు రాలుతుందని భయపడుతుంటారు. మరి నిజంగానే హెయిర్ ఫాల్ అవుతుందా..? అసలు దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి రోజు తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందని చాలా మంది భయపడి పోతుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జుట్టుకు ఎలాంటి హాని ఉండదని, జుట్టు రాలదని చెబుతున్నారు.

మరి జుట్టు రాలడానికి కారణాలు:

1) జన్యూ కారణాలు

2) హార్మోన్లలో మార్పులు

3) ఒత్తిడి

4) హెల్త్ ప్రాబ్లమ్స్

ఇలాంటి కారణాల వల్ల జుట్టు రాలుతుంది. నిజానికి రెగ్యూలర్‌గా హెయిర్ వాష్ చేయడం వల్ల జుట్టులోని ఎక్స్‌‌ట్రా ఆయిల్, దుమ్ము, చెమట దూరమవుతుంది. ఇది తలని ఆరోగ్యంగా చేసి జుట్టుని పెరిగేలా చేస్తుంది.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Next Story