- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబంలో తిరస్కరణకు గురయ్యారా?.. ఆ బాధను తట్టుకోవాలంటే..
దిశ, ఫీచర్స్: మీకు మ్యాథ్స్ అంటే ఇష్టం.. కానీ పేరెంట్స్ సైన్స్ చదవాలంటారు.. మీకు ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌కి వెళ్లడం ఇష్టం.. కానీ కుటుంబ సభ్యులు తిరస్కరిస్తారు. అలాగని వారికి మీ మీద కోపం, పగ వంటివి ఉంటాయని మాత్రం కాదిక్కడ. అప్పుడున్న కుటుంబ, ఆర్థిక, సామాజిక పరిస్థితులో వారు తిరస్కరించవచ్చు. అర్థం చేసుకోవడంలో పొరపాటో, మీ భవిష్యత్తు గురించిన ఆలోచనలో కారణం కావచ్చు. మీ భావాలను, అభిప్రాయాలను, నిర్ణయాలను తిరస్కరిండం వెనుక ఇంకా బలమైన కారణాలు కూడా ఉండవచ్చు. కొందరి విషయంలో కుటుంబం వల్లే అసలు సమస్య ఉండవచ్చు. ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా యువతీ యువకులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్‌లో ‘ఫ్యామిలీ రిజెక్షన్’ సాధారణంగా ఉంటోంది. దీని నుంచి బయట పడేందుకు నిపుణులు చేస్తున్న సూచనలేమిటో చూద్దాం.
స్వీయ అనుభూతి
ఫ్యామిలీ రిజెక్షన్‌తో డీల్ చేస్తున్నప్పుడు మీరు వేయాల్సిన మొదటి అడుగు ఏంటంటే.. ముందుగా మీ భావాలను, బాధలను గుర్తించడం. మీకు మీరు బాధపడటం, మీ ఫీలింగ్స్‌ను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించడం (స్వీయ అనుభూతి) వంటివి చేసినంత మాత్రాన వెంటనే అవి దూరమైపోతాయని అనుకోవడానికి లేదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు ఆ అనుభూతిని ఫీల్ అవ్వడం కూడా సమస్యను దూరం చేస్తుంది. కాబట్టి ఆ క్షణంలో మీకు మనసులో బాధగా అనిపించి, ఏడ్వాలనిపిస్తే ఏడ్చేయండి అంటున్నారు నిపుణులు. దీనివల్ల మనసు తేలిక పడుతుంది. ఫ్యామిలీ రిజెక్షన్ బాధ నుంచి బయట పడటానికి ఇదొక మంచి సొల్యూషన్.
ఫీలింగ్స్‌ను రాయండి
కుటుంబం నుంచి తిరస్కరణకు గురైతే కొందరికి ఏమీ తోచదు. తమ ఉద్దేశం, లక్ష్యం, భావాల విషయంలో కూడా క్లారిటీ మిస్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. మీకంటూ ఓ స్పష్టత రావాలంటే.. మీ ఫీలింగ్స్‌ను ఓ నోట్ బుక్‌లో రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మీలో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ రిజెక్షన్ అనేది అది బాధ, కోపం, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. అలా మీ ఫీలింగ్స్ రాయడంవల్ల వాటిని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు.
సానుకూల దృక్పథం
మీరు బాధలో ఉన్నప్పుడు విషయాలపట్ల తక్కువ అనుభూతిని చెందుతారు. ఫలితంగా మరింత బాధలో కూరుకుపోతారు. దీన్నుంచి బయట పడటానికి మీ దృక్పథాన్ని మార్చుకోవడం సహాయపడుతుందని మానసిక నిపుణులు సూచిస్తు్న్నారు. ముఖ్యంగా మీ అనుభవాలు, ఆలోచనలను సానుకూల దృక్పథంలో ఆలోచించాలి. మిమ్మల్ని మీరు పాజిటివ్ కోణంలో మల్చుకోవడానికి ‘నేను ప్రేమ, గౌరవానికి అర్హుడిని’, ‘నాకు చాలా టాలెంట్ ఉంది. వాస్తవానికి నేను తెలివైన వ్యక్తిని’ వంటి పద బంధాలను మనసులో అనుకుంటూ రిపీట్ చేయండి. దీంతో కొంత సమయానికో, కొన్ని రోజులకో మీ దృక్పథంలో మార్పు వస్తుందని, బాధల నుంచి బయటపడటంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రతికూల ఆలోచనలు
ఒక బాధలో ఉన్నవారు దానిని ఫీలవడం వల్ల మనసు తేలిక పడుతుంది. ఆ తర్వాత సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. కానీ కుటుంబంలో తిరస్కరణకు గురైన వ్యక్తుల్లో ఇందుకు కాస్త భిన్నంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ సపోర్ట్, అన్ని సందర్భాల్లో అవసరమైన ప్రేమను కోల్పోయామనే ఫీలింగ్స్ వెంటాడుతుంటాయి. అయితే పదే పదే ఈ విధమైన నెగెటివ్ థింకింగ్‌ను పరిమితం చేస్తూ ఉంటే.. క్రమంగా మనసు మారుతుంది. అర్థం చేసుకోవడం, వాస్తవాలు తెలుసుకోవడం చేస్తారు.
రిజెక్షన్ అండ్ రీ ఫ్రేమ్
సందేహస్పద కుటుంబ సభ్యులతో లేదా అంతకంటే ఎక్కువ మంది నుంచి మీరు మానసిక లేదా శారీరక వేధింపులను ఎదుర్కొన్నట్లయితే రిజెక్షన్‌ను రీ ఫ్రేమ్ చేసే టెక్నిక్ ప్రత్యేకంగా వర్తిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్యామిలీ రిజెక్షన్ కూడా మీకు మేలు చేయవచ్చు. మీ నిర్ణయాలు, ఆత్మగౌరవం, భవిష్యత్తు వంటి వాటికంటే కుటుంబ సభ్యుల తిరస్కరణ మేలు చేయనిది కానప్పుడు తిరస్కరణను మీ సానుకూల దృక్పథానికి అనుకూలంగా మల్చుకోవాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మీరున్న పరిస్థితిలో కుటుంబంతో కలిసి ఉండకపోవడం లేదా వారికి దూరంగా ఉండటమే మంచిది అయింది వంటి ఆలోచనలతో మీ మైండ్ సెట్‌ను మీకు అనుకూలంగా సెట్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం అవసరం అయితే నిపుణులు, నమ్మదగిన వ్యక్తులు, ఎమోషనల్ సపోర్ట్ అందించే కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరిమీద అయినా ఆధారపడవచ్చు. అలాగే కొన్నిసార్లు సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ వంటివి కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు.