- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయం మిగిలిన ఇడ్లీలతో ఇలా టెస్టీ స్నాక్ చేసుకోండి..!
దిశ, ఫీచర్స్: దక్షిణ భారతదేశంలో ఇడ్లీ చాలా ప్రాచుర్యం పొందిన బ్రేక్‌ఫాస్ట్. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా కొందరు డిన్నర్‌కి కూడా తింటుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఉదయాన్నే చేసిన ఇడ్లీలు మిగిలిపోతుంటాయి. చల్లారిని ఇడ్లీలను తినేందుకు చాలామంది ఇష్టపడరు. దీని వల్ల ఇవి వేస్ట్ అవుతాయి. ఇడ్లీలను వృధా చేయకుండా సాయంత్రం వేళ టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు వేస్ట్ అవ్వవు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్ధాం.
కావాల్సిన పదార్థాలు:
ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీలు
రెండు టీస్పూన్‌ల షెజ్వా్న్ సాస్
ఉల్లిపాయ-1
పచ్చిమిర్చి-2
క్యాప్సికం-1
నూనె-2 టేబుల్ స్పూన్‌లు
వెల్లుల్లి- 2 రెబ్బలు
స్ప్రింగ్ ఆనియన్
గరం మసాలా
ఉప్పు
కొత్తిమీర
తయారీ విధానం:
మిగిన ఇడ్లీలను ఒక్కొక్కటిని ఆరు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీరను సన్నగా తరగాలి. స్టవ్‌పై ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్‌ల నూనె వేసుకొని వేడిచేయాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించాలి. కాసేపటి తరువాత తరిగిన ఉల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుతుండాలి. ఆ తర్వాత షెజ్వాన్ సాస్, ఉప్పు, గరం మసాలా తగినంత వేసుకోవాలి. 30 సెక్లపాటు హైఫ్లేమ్‌పై బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తరువాత అందులో కట్ చేసిన ఇడ్లీ ముక్కలను వేయాలి. ఇడ్లీలకు మిశ్రమం అంటుకునేలా బాగా కలపాలి. చివరిగా తరిగిన కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే షెజ్వాన్ సాస్ ఇడ్లీ రెడీ.
Read More ...
Belly Fat: పొట్టను కరిగించే జపనీస్ వర్కౌట్స్..ఇలా ట్రైయ్ చేయండి..!