సైలెంట్ కిల్లర్‌గా సెకండ్ హ్యాండ్ స్మోక్..

by Naresh |
సైలెంట్ కిల్లర్‌గా సెకండ్ హ్యాండ్ స్మోక్..
X

దిశ, ఫీచర్స్ : స్మోకింగ్ ఏ రూపంలోనైనా ఆరోగ్యానికి హానికరమే. అంటే సిగరెట్, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులను మనం నేరుగా ఉపయోగించాల్సిన పనిలేదు. ధూమపానప్రియులు వదిలిన పొగను ఇండైరెక్ట్‌గా పీల్చడం కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది. ఇక గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే 2016-17 ప్రకారం ఇండియాలో దాదాపు 30% మంది అడల్ట్స్ పొగతాగుతుండగా.. ఈ తరహా పొగలో 4,000కు పైగా విషపూరిత రసాయనాలు ఉంటాయి. పైగా ఈ సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కు గురయ్యే విషయంలో సురక్షితమైన స్థాయి అంటూ లేదు.

సెకండ్‌హ్యాండ్ స్మోక్‌తో ఆరోగ్య ప్రభావాలు

సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ లేదా యాక్టివ్ స్మోకర్స్‌కు హృదయ సంబంధ వ్యాధులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, పల్మనరీ డిసీజెస్, లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాదు సెకండ్‌హ్యాండ్ పొగను కొద్దిసేపు పీల్చినా రక్త నాళాల లైనింగ్‌ను దెబ్బతీయడంతో పాటు బ్లడ్ ప్లేట్‌లెట్స్ అంటుకునేలా చేస్తుంది. ఈ మార్పులు గుండెపోటుకు కారణమవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం 25%-30%, ఊపిరితిత్తుల క్యాన్సర్ 20%-30% పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది ప్రత్యక్ష ధూమపానం వలె ప్రమాదకరంగా మారుతుంది. వారిలో లోయర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్ తలెత్తుతాయి.

రక్షణ ఎలా?

గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే(GATS), ఇండియా-2017 ప్రకారం.. 2009-2010 నుంచి భారత్‌లో బహిరంగ ప్రదేశాల్లో సెకండ్‌హ్యాండ్ పొగకు గురవడం 29% నుంచి 23%కి తగ్గింది. ఇంట్లో ఎక్స్‌పోజర్ సైతం 52% నుంచి 39%కి తగ్గింది. అయితే కార్యాలయాల్లో మాత్రం ఈ ఎక్స్‌పోజర్ 29.9% నుంచి 30.2%కి పెరిగింది. అయితే ఎటువంటి మినహాయింపులులేని సమగ్రమైన పొగ రహిత చట్టాలు మాత్రమే స్మోకర్స్, నాన్ స్మోకర్స్‌ రక్షణలో ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మోకింగ్‌తో పాటు సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల కలిగే ప్రాణాంతక ప్రభావాలను వివరించే కార్యక్రమాలు రూపొందించడంతో పాటు నాన్ స్మోకర్స్ ఆరోగ్య హక్కు గురించి అవగాహన కల్పించడం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed