లవర్స్‌కు గుడ్ న్యూస్.. వారం రోజులు లవ్ హాలీడేస్.. ఏం చేసుకున్నా వీడియోలు షూట్ చేయాలని షరతు!

by sudharani |   ( Updated:2023-04-29 15:29:17.0  )
లవర్స్‌కు గుడ్ న్యూస్.. వారం రోజులు లవ్ హాలీడేస్.. ఏం చేసుకున్నా వీడియోలు షూట్ చేయాలని షరతు!
X

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్ హాలీడేస్.. ఫెస్టివల్ హాలీడేస్.. అధిక వర్షాల వల్ల కూడా హాలీడేస్ ఇస్తుంటారు. అంతేకాదు.. కరోనా మహమ్మారి మన దేశంలో విజృంభించినప్పుడు కూడా హాలీడేస్ ఇచ్చారు. ఇవన్నీ మనకు తెలిసినవే. ఎక్కడైనా జరిగేవే. కానీ, లవ్ చేసుకోవడానికి కూడా హాలిడేస్ ఇవ్వడం మీరెప్పుడైనా చూశారా? నిజానికి ఎవర్నైనా ప్రేమలో ఉన్నారని తెలిస్తేనే చితక్కొట్టే పెద్దవాళ్లు మనకు లవ్ హాలీడేస్ ఎలా ఇస్తారని అనుకుంటున్నారా? అయితే, మన దగ్గర వర్తించే రూల్స్ చైనాలో వర్తించవు.

అందుకే అక్కడ కొన్ని కాలేజీలు లవ్ హాలీడేస్ ప్రకటించాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరున్న చైనాను తక్కువ జనన రేటు సమస్య వేధిస్తోంది. అక్కడి యువత పెళ్లికి నిరాకరిస్తుండటంతో జననాల రేటు దారుణంగా పడిపోతోంది. దీంతో కొన్ని కాలేజీలు విద్యార్థులకు ప్రేమలో పడమని 'ఫాల్ ఇన్ లవ్' పేరుతో వారం రోజు సెలవు ప్రకటించాయి. విద్యార్థులకు హోమ్ వర్క్ సెలవుల్లోని అనుభూతులు, ట్రిప్ వీడియోలు సమర్పించాలని కండీషన్ పెట్టాయట. ఫలితంగా యువతలో పెళ్లిపై ఆసక్తి కలిగి జనాభా పెరుగుతుందని చైనా భావిస్తోంది.

Also Read..

ఆత్మీయుల మరణం పిల్లలపై ప్రభావం.. పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

ఓరల్ సెక్స్‌తో గొంతు క్యాన్సర్‌.. అధ్యయనంలో వెల్లడి

Advertisement

Next Story