గాసిప్‌లో నిజముంటే మేలు జరుగుతుందా?

by Hamsa |
గాసిప్‌లో నిజముంటే మేలు జరుగుతుందా?
X

దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తి గురించి వారి పరోక్షంలో మాట్లాడటం హానికరంగా లేదా నిజాయితీ లేనట్లుగా అనిపించవచ్చు. కానీ కొత్త పరిశోధన ప్రకారం అలా షేర్ చేయబడిన సమాచారం వాస్తవం ఆధారంగా ఉంటే మాత్రం అది ఇతరులతో మన సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ లెక్కన గాసిప్స్ ఎంత విస్తృతంగా కనిపిస్తున్నా.. ఏదో ఒకవిధంగా ఉపయోగపడేందుకు బలమైన అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పరిశోధనా విభాగం గాసిప్ పట్ల కొన్ని ముఖ్యమైన సామాజిక విధులను వెల్లడించింది.

ఉదాహరణకు.. మరొకరి విశ్వసనీయతను నిర్ధారించడానికి ఇది మంచి మార్గం. ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనం కోసం మూడో వ్యక్తి గురించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే, వినేవాడు అబద్ధాలను గుర్తించగలడు. అలాగే అతనిపై అబద్ధాలకోరుగా ముద్రవేయొచ్చు. ఇది ఒక రకమైన సామాజిక శిక్షే. ఇలా కాకుండా ఎవరైనా థర్డ్ పార్టీ గురించి నిజమైన సమాచారాన్ని పంచుకుంటే, ఇది వ్యక్తుల మధ్య నమ్మకాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా గ్రూప్ కోఆపరేషన్, టీమ్ వర్క్ ప్రోత్సహించబడుతుంది. అయితే, అంతర్జాతీయ పరిశోధకుల బృందం సరళీకృత గణిత నమూనాను ఉపయోగించి గాసిప్స్ నిజాయితీగా లేదా నిజాయితీ లేనివిగా ఎప్పుడు ఉండవచ్చో అన్వేషించారు. ఈ మేరకు వారు గాసిప్‌ను ఒక త్రిభుజంగా అనుకరించారు. ఇందులోని ఒక మూలాధారం గాసిపర్, మరొక మూలాధారం గ్రహీత కాగా.. పైభాగం అనేది అక్కడలేని మూడో వ్యక్తి.

ఈ మోడలింగ్‌తో, పరిశోధకులు వారి పరికల్పనను పరీక్షించారు. సాధారణంగా గాసిపర్లు ఇతర రెండు పార్టీలతో ఒక లక్ష్యాన్ని పంచుకున్నప్పుడు నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారి విజయం(లేదా వైఫల్యం) ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. కానీ తమ లక్ష్యాలు.. గ్రహీతతో పాటు ఆ గాసిప్ లక్ష్యంతో సరిపోలనప్పుడు వారు అబద్ధాలు చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. 'మీరు బహుమతి పొందిన ప్రమోషన్ కోసం సహోద్యోగితో పోటీ పడవచ్చు. ఇక్కడ మీలో ఒకరు మాత్రమే ఉద్యోగం పొందగలరు. అటువంటి పరిస్థితుల్లో వ్యక్తులు ప్రతికూలంగా పరస్పరం ఆధారపడతారు. అంటే ఒక వ్యక్తి వైఫల్యం ఇతరుల విజయం అని అర్థం. అలాంటి పరిస్థితులు సహోద్యోగులకు హాని కలిగించే నిజాయితీ లేని గాసిప్స్‌కు దారితీస్తాయని లేదా గాసిప్‌లోని కంటెంట్ ఇప్పటికే నెగెటివ్‌గా ఉన్నప్పుడు నిజాయితీ గల గాసిప్స్‌కు దారితీస్తుందని ఆశించవచ్చు' అని నెదర్లాండ్స్‌లోని ఐండ్‌హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి సహాయక రచయిత, మెటాసైంటిస్ట్ లియో టియోఖిన్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed