- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పిల్లలకు స్నాక్స్ టైంలో చిప్స్ ఇస్తున్నారా.? చిక్కుల్లో పడ్డట్టే..
దిశ, ఫీచర్స్ : చిప్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పెద్ద వారి వరకు చిప్స్ అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. చిప్స్ లో కూడా ఎన్నో రకాల ఫ్లేవర్స్ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. రంగురంగుల కలర్లలో అందరినీ ఆకర్షించే విధంగా చిప్స్ ను ప్యాక్ చేసి మార్కెట్లోకి సప్లై చేస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తినే చిప్స్ తో ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ చిప్స్ తినడంవలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్యాకింగ్ చేసిన చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటిలో సోడియంను ఎక్కువగా వినియోగిస్తారు. ఈ సోడియంను అధికమోతాదులో తీసుకోవడం వలన రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చిప్స్ తయారీ కోసం వినియోగించే నూనె ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం ఎక్కువగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చిప్స్‌లో నిలువ ఉండే ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో అధిక కొవ్వును పెంచుతుంది. దాంతో ధమనుల్లో రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
చిప్స్ కారణంగా శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో అధిక బరువు పెరిగి ఊబకాయం బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు చిప్స్‌ను నూనెలో ఫ్రై చేయడం వలన అందులో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే చిప్స్‌లో ఫైబర్ ఉండకపోవడం వలన చిన్నారులు మలబద్ధకం సమస్య ఎదుర్కోవలసి వస్తుందట. అలాగే చిప్స్‌తో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే బరువు పెరగడం, వంధ్యత్వం, జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో గ్యాస్ వంటి సమస్యలకు చిప్స్ కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోగ నిరోధక శక్తి బలహీన పడి, బ్యాక్టీరియా, వైరస్ దాడులు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read More..
గులాబ్ జామూన్‌తో కొత్త రెసిపీ .. పిచ్చెక్కిపోతున్న పిజ్జా లవర్స్..