- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యూచర్ ఫుడ్ & ఫీడ్.. కీటకాలే!
దిశ, ఫీచర్స్ : పౌల్ట్రీ, ఆక్వా కల్చర్, పాడి పశువులతో కూడిన జంతు వ్యవసాయమే ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రొటీన్ సరఫరాకు సహకారం అందిస్తోంది. సగటు వినియోగదారుని కొనుగోలు శక్తి పెరుగుదలతో పాటు ఆయా ఉత్పత్తుల వినియోగం పెరగడంతో, జంతు-ఉత్పన్నమైన ప్రొటీన్‌కు డిమాండ్ వచ్చే మూడు దశాబ్దాల్లో రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అయితే నేటికీ ప్రపంచవ్యాప్తంగా సోయా, మొక్కజొన్న ఉత్పత్తిలో అధిక భాగం పశుగ్రాసాల తయారీకే ఉపయోగిస్తున్నారు. ఏటా 20 మిలియన్ టన్నుల సముద్రపు చేపలను ఫిష్ మీల్ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ గణాంకాలు స్థిరత్వం, ఆహార భద్రత విషయంలో తీవ్ర ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు శాకాహారం లేదా పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారానికి మారడమే రాబోయే ప్రొటీన్ సంక్షోభానికి సులభ పరిష్కారమా? ఇంకేమైనా ప్రత్యామ్నాలున్నాయా?
ప్రపంచవ్యాప్తంగా 43% ప్రజలు ప్రధాన ఆహారంగా జంతు-ఉత్పన్నమైన ప్రొటీన్ వనరులపై ఆధారపడుతున్నారు. ఇక భారత్ ఎక్కువగా శాకాహారం లేదా పాడి ఆధారిత దేశంగా గుర్తించబడినప్పటికీ మాంసం, చేపలు లేదా గుడ్లు తినేవారు 70% మంది ఉన్నారు. తలసరి వినియోగం తక్కువే అయినా ఇండియాలో లేయర్ పౌల్ట్రీ యొక్క CAGR(Common Annual Growth Rate) సుమారుగా 6-8 శాతం. బ్రాయిలర్ పౌల్ట్రీ, ఆక్వాకల్చర్ అయితే 10-12 శాతం. ఇతర వ్యవసాయ రూపాలతో పోల్చితే ఇది ఏడాదికి 2.5% వృద్ధిని కలిగి ఉంది. కానీ మొక్కలు, జంతువుల పెంపకం రెండూ ప్రొటీన్ సమస్యకు పరిష్కారం కానట్లయితే.. మరింత స్థిరమైన, సురక్షితమైన ఆహార వ్యవస్థను రూపొందించడానికి మనకు సాయపడేది ఎవరనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే 'కీటకాలే' అందుకు పరిష్కారం కావచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సాగులో 2000 రకాల కీటకాలు :
చేపలు, కోళ్లు, రొయ్యలు, ఇతర పశువులకు సహజ ఆహారమైన కీటకాలు.. వాటికి సరైన పోషణ, రుచిని అందించడమే కాక రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. అంతేకాదు ప్రకృతిని పరిశుభ్రపరిచే ఈ కీటకాలు ఆర్గానిక్ బై ప్రొడక్ట్స్‌ను ఫుడ్‌గా వినియోగిస్తాయి. వ్యవసాయ యోగ్యమైన భూమిని వాడుకోవు. పరిమిత తాగునీరే అవసరం. అతి తక్కువ గ్రీన్ హౌస్ వాయి ఉద్గారాలను వెలువరిస్తాయి. కాగా ఈ కీటకాల ఆహారం 20 శాతం ఉత్పాదకతను పెంచుతుందని.. క్రిమి ఆధారిత ప్రొటీన్లు, కొవ్వులను చేర్చడంతో పెంపుడు జంతువుల మరణాల రేటులో 10 శాతం వరకు మెరుగుదలని చూపించిందని పరిశోధనలో తేలింది. ఇది వింతగా అనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా 2000 రకాల కీటకాలను ఎంటోమోఫాగి కోసం సాగు చేస్తున్నారు. దీని ద్వారా గుడ్లు, లార్వా, ప్యూపా సహా కొన్ని కీటకాల్లో పెద్ద జీవులను వేల సంవత్సరాల నుంచి మానవులు తినేస్తున్నారు.
పుష్కలంగా పోషకాలు :
నిజానికి, నేడు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ ప్రజల ఆహారంలో కీటకాలు ప్రధాన భాగం. కోడి 55 శాతంతో పోల్చితే కీటకాల శరీర బరువులో 80 శాతం వరకు తినదగినది. కీటకాలు కోల్డ్ బ్లడెడ్, వేగంగా పునరుత్పత్తి చేయడం వల్ల ఫీడ్ మార్పిడి సామర్థ్యంలో కూడా మెరుగ్గా పనిచేస్తాయి. 30-75 శాతం ప్రొటీన్, 15-40 శాతం కొవ్వులతో పోషకాహారం పుష్కలంగా లభిస్తుంది. అధిక మొత్తంలో విటమిన్లు B1, B2, B3, ఐరన్, జింక్ సహా అన్ని అవసరమైన, అనవసరమైన అమైనో ఆమ్లాలకు మంచి మూలం. మేత పదార్థంగా, ఆహార వనరుగా ఇలాంటి లక్షణాలే కీటకాలను సరైన పోషకాహార వనరుగా చేస్తుంది.
ఫ్యూచర్ ఆఫ్ 'ఫుడ్ & ఫీడ్'గా గుర్తించిన UN FAO :
కీటకాల వ్యవసాయం అనేది కొత్త భావన కాదు. మానవులు అనేక సంవత్సరాలుగా తేనె & పట్టు కోసం తేనెటీగలు, పట్టు పురుగులను సాగు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ లేట్ కంపెనీలు.. బ్లాక్ సోల్జర్ ఫ్లైస్, క్రికెట్స్, మీల్‌వార్మ్స్, బీటిల్స్, గ్రాస్‌షాపర్స్ మొదలైనవాటిని ఆటోమేట్ చేయడం, భారీ పురుగుల ఉత్పత్తిని స్కేలింగ్ చేయడం ద్వారా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తున్నాయి. చాలా కీటకాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-హైపర్‌టెన్సివ్, ఇతర ఉపయోగకరమైన లక్షణాలను కలిగిన జీవఅణువులతో సమృద్ధిగా ఉంటాయి. ఇతర రంగాల్లోనే కాక న్యూట్రాస్యూటికల్స్, ఫార్మాస్యూటికల్స్‌లోనూ వీటి వినియోగానికి మరింత దారితీయొచ్చు. UN FAO కూడా ఇప్పటికే 'ఫుడ్ & ఫీడ్' భవిష్యత్‌గా కీటకాలను గుర్తించింది. వాటి ప్రయోజనాలను పేర్కొంటూ అనేక నివేదికలను ప్రచురించింది.
దృష్టిసారించాల్సిన విషయాలు :
అయితే, పోషకాహారం & పర్యావరణ ప్రయోజనాలు మాత్రమే క్రిమి ఆధారిత ఉత్పత్తుల ప్రత్యక్ష వినియోగం కోసం సగటు వినియోగదారు అవగాహనలో మార్పుకు దారితీయవు. ప్రజలు కీటకాలను నిజమైన ఆహార వనరుగా లేదా పదార్థంగా అంగీకరించడం ప్రారంభించే ముందు అసహ్యపడే కారకాలు, రుచిని తిరస్కరించే అవకాశాలు, సంభావ్య హానికరమైన పరిణామాలతో పాటు సాధారణంగా ఆలోచనాత్మక కారకాలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇన్‌సెక్ట్ ఫామింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ.. గణనీయమైన ఉత్పత్తి ప్రమాణాలు, నాణ్యత స్థిరత్వం & ఆధిక్యత, ఆర్థిక సాధ్యత వంటి విషయాల్లో తనను తాను నిరూపించుకోవడం కూడా చాలా ముఖ్యం.