- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీమో థెరపీ.. చికిత్సకు ముందు క్యాన్సర్ రోగులు తెలుసుకోవాల్సిన విషయాలు.. (Full Details Of Chemotherapy)
దిశ, ఫీచర్స్ : కీమో థెరపీ అనేది అత్యంత ఎక్కువగా ఉపయోగించే క్యాన్సర్ చికిత్సలలో ఒకటి. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే రసాయనాలను ఉపయోగిస్తుంది. క్యాన్సర్ తీవ్రత రకాన్ని బట్టి.. క్యాన్సర్ కణాల మల్టీప్లికేషన్ ను ఆపగలదు. కణితిని తగ్గిస్తుంది. వ్యాధి లక్షణాలను నిర్వహించడంలోనూ సహాయపడుతుంది. దీనివల్ల రోగులు మెరుగైన నాణ్యమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు కీమోథెరపీ అనేక రకాల దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది.
కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాలను తొలగించడానికి మందులను ఉపయోగించే ఒక ప్రభావవంతమైన చికిత్స. అసాధారణ రేటుతో మల్టీప్లై అయ్యే క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుంటుంది. చంపడానికి లేదా నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది . కీమోథెరపీ లక్ష్యం కణాల విస్తరణ, కణితి పెరిగే తీరును నిరోధించడం. అయితే కీమోథెరపీ చేయించుకుంటున్న రోగులు తక్కువ రక్త గణనలు, వికారం, జుట్టు రాలడం వంటి దుష్ప్రభావాలను కూడా అనుభవిస్తారు. శరీరంలోని ఎముక మజ్జలో ఉత్పత్తి అయ్యేటటువంటి రక్త కణాలు, జీర్ణాశయం, వెంట్రుకల కుదుళ్లు మందులకు రియాక్టివ్ గా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. అయితే చికిత్స పూర్తయిన తర్వాత తరచుగా ఈ లక్షణాలు తగ్గుతాయి.
ఈ చికిత్స ఉద్దేశ్యం...
కీమోథెరపీ ప్రధాన లక్ష్యం క్యాన్సర్ కణాలను పునరుత్పత్తి చేయకుండా ఆపడం. శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించడం. క్యాన్సర్ రకం, స్టేజ్, రోగుల మొత్తం పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కణాలను తొలగించడానికి, క్యాన్సర్‌ను నయం చేయడానికి కీమోథెరపీని ఉపయోగించవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో కణితి పరిమాణాన్ని తగ్గించడానికి శస్త్రచికిత్సకు సహాయక చికిత్సగా ఉపయోగించబడుతుంది.
కీమో థెరపీ రకాలు
ఆల్కైలేటింగ్ ఏజెంట్లు
ఈ మందులు కణాల లోపల DNAతో ఇంటర్ఫియర్ అవుతాయి. క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తాయి. DNA అనేది కణాలలో జన్యు పదార్ధం. ఇది వాటి పెరుగుదల, పనితీరుకు మార్గనిర్దేశం చేస్తుంది. DNA దెబ్బతినడం ద్వారా.. ఆల్కైలేటింగ్ ఏజెంట్లు క్యాన్సర్ కణాలను రిప్రొడ్యూజ్ కాకుండా ఆపుతాయి. అయితే ఇవి కణాలన్నింటినీ ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆరోగ్యకరమైన కణాలకు కూడా హాని కలిగిస్తాయి.
యాంటీమెటాబోలైట్స్
ఈ మందులు DNA , RNA బిల్డింగ్ బ్లాక్‌లను అనుకరిస్తాయి. కణాలలో జన్యు సమాచారాన్ని తీసుకువెళ్ళే అణువులు.. క్యాన్సర్ కణాలు పెరగడానికి ఈ తప్పుడు బిల్డింగ్ బ్లాక్‌లను ఉపయోగించేందుకు ప్రయత్నించినప్పుడు.. ఈ ప్రక్రియ అంతరాయం కలిగిస్తుంది. క్యాన్సర్ కణాలు చనిపోతాయి. మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీలో ప్రచురించబడిన అధ్యయనం.. ఇవి క్యాన్సర్ కణాల న్యూక్లియిక్ యాసిడ్ సంశ్లేషణకు భంగం కలిగించే మందులు అని పేర్కొంది. కాగా ఇది సెల్ లోపల DNA, RNA వంటి కొత్త న్యూక్లియిక్ ఆమ్లాలను సృష్టించే ప్రక్రియ.
యాంటిట్యూమర్ యాంటీబయాటిక్స్
పేరులో యాంటీబయాటిక్స్ ఉన్నప్పటికీ.. ఇవి అంటువ్యాధుల చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్స్ కాదు. కణాల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగించే యాంటీకాన్సర్ మందులు అని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఇవి కణాలలోని జన్యు పదార్థమైన DNAతో జోక్యం చేసుకుంటాయి. క్యాన్సర్ కణాలలో DNA ను బంధించే మందులు, కణాలు రిప్రొడ్యూస్ కాకుండా నిరోధించడం, చివరికి కణాల మరణానికి దారితీస్తాయి.
టోపోయిసోమెరేస్ ఇన్హిబిటర్స్
ఈ మందులు కణ విభజన సమయంలో DNA నిర్మాణాన్ని నిర్వహించడంలో సహాయపడే టోపోయిసోమెరేసెస్ అని పిలువబడే ఎంజైమ్‌ల చర్యను నిరోధిస్తాయి. వీటిని నిరోధించడం ద్వారా.. టోపోయిసోమెరేస్ ఇన్హిబిటర్లు క్యాన్సర్ కణాల విభజన జరగకుండా, పెరగకుండా నిరోధిస్తాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్‌లో ప్రచురించబడిన అధ్యయనం.. టోపోయిసోమెరేస్ ఇన్హిబిటర్లు చికిత్సా సామర్థ్యాన్ని పెంచుతాయి. దుష్ప్రభావాల అవకాశాన్ని తగ్గిస్తాయి.
మైటోటిక్ ఇన్హిబిటర్స్
ఈ మందులు మైటోసిస్‌ను నిరోధిస్తాయి, ఇది కణాలు విభజించడానికి, ప్రతిబింబించడానికి ఉపయోగించే ప్రక్రియ. కాగా ఈ ప్రాసెస్ ఆపడం ద్వారా.. మైటోటిక్ ఇన్హిబిటర్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. ముఖ్యంగా వేగంగా పెరిగే క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక మైటోటిక్ అరెస్ట్, కణాల మరణానికి దారితీసే మైటోసిస్‌ను నిరోధిస్తుందని న్యూరోసైన్స్ లో ప్రచురించబడిన అధ్యయనం పేర్కొంది.
కార్టికోస్టెరాయిడ్స్
ఇవి స్టెరాయిడ్ మందులు కాగా వాపును తగ్గించేందుకు, రోగనిరోధక వ్యవస్థను అణిచివేసేందుకు సహాయపడతాయి. క్యాన్సర్ చికిత్సలో వికారం, అలెర్జీ వంటి కీమోథెరపీ దుష్ప్రభావాలను నిర్వహించడానికి కార్టికోస్టెరాయిడ్స్ తరచుగా ఉపయోగించబడతాయి.
కీమో థెరపీ ఎలా ఇస్తారు?
కీమోథెరపీని నిర్వహించే అత్యంత సాధారణ మార్గం ఇంట్రావీనస్ (IV) ఇన్ఫ్యూషన్. ఇందులో మందులు సూది లేదా కాథెటర్ ద్వారా నేరుగా సిరలోకి ఇంజెక్ట్ చేయబడతాయి. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ రకాన్ని బట్టి.. మాత్రలు లేదా క్యాప్సూల్స్ రూపంలో నోటి ద్వారా కండరాలలోకి లేదా చర్మం కిందకి ఇంజెక్ట్ చేయవచ్చు. కీమోథెరపీని మూత్రాశయం లేదా పొత్తికడుపు కుహరం వంటి శరీరంలోని నిర్దిష్ట భాగానికి నేరుగా పంపిణీ చేయవచ్చు. అయితే దీనికి ముందు రోగి ఈ చికిత్సకు తట్టుకుంటాడా లేదా అనేది రోగి ట్రీట్మెంట్ హిస్టరీ, కొన్ని టెస్టుల ద్వారా నిర్ణయిస్తారు వైద్యులు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కీమోథెరపీ పూర్తి చేయడానికి, దాని దుష్ప్రభావాలను నిర్వహించడానికి.. శారీరకంగా, మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. రోగులు హైడ్రేటెడ్‌గా ఉండాలి. పోషకాహారంతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఈ కాలంలో రోగి రోగనిరోధక వ్యవస్థ అంతగా పని చేయదు కాబట్టి.. అనారోగ్యంగా ఉండే వ్యక్తులను కలవడం మానుకోవాలి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండకూడదు. వ్యక్తిగత ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ని పర్యవేక్షించడానికి వైద్యులు సూచించే సాధారణ రక్త పరీక్షలు మొదలైన సలహాలను ఫాలో కావాల్సి ఉంటుంది.
ప్రమాదాలు
- అంటువ్యాధులు: కీమోథెరపీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది కాబట్టి రోగులు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
- రక్తహీనత: కీమోథెరపీ ఎర్ర రక్త కణాల సంఖ్యను తగ్గిస్తుంది. అలసట, బలహీనతను కలిగిస్తుంది.
- వికారం, వాంతులు: మందులతో కలిగే సాధారణ దుష్ప్రభావం.
- జుట్టు రాలడం: హెయిర్ ఫోలికల్స్‌లోని కణాలను వేగంగా విభజించడంలో కీమోథెరపీ ప్రభావం ఉంటుంది.
- అవయవ నష్టం: కొన్ని కీమోథెరపీ మందులు గుండె, కాలేయం లేదా మూత్రపిండాలు వంటి అవయవాలను ప్రభావితం చేయవచ్చు, కాబట్టి క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం.