- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్లూ లైటింగ్ ఎఫెక్ట్ .. తరచూ స్క్రీన్ చూడటంవల్ల వస్తున్న స్కిన్ అలెర్జీలు
దిశ, ఫీచర్స్ : మీరు స్మార్ట్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి స్ర్కీన్లను చూడటానికి రాత్రింబవళ్లు అత్యధిక సమయం కేటాయిస్తున్నారా? అయితే స్కిన్ అలెర్జీలు వచ్చే అవకాశం ఉందని డెర్మటాలజిస్టులు అంటున్నారు. ఎందుకంటే వాటినుంచి వెలువడే ‘బ్లూ లైటింగ్’ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. ఈ కాంతికి గురవడంవల్ల చర్మ స్కిన్ అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు, మంట, దురద వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక ప్రతిరోజూ అత్యధిక సమయం స్ర్కీన్ చూడటానికి కేటాయించే చర్మంలో వృద్ధాప్య లక్షణాలు కూడా త్వరగా వచ్చి ఏజ్ బార్ వ్యక్తుల్లాగా కనిపిస్తారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. అమెరికన్లు, చైనీయుల కంటే కూడా ఎక్కువగా భారతీయుల డిజిటల్ స్ర్కీన్లను చూసేందుకు అధిక సమయం కేటాయిస్తున్నారు. ఇక ఈ విషయంలో ప్రపంచం మొత్తం కేటాయిస్తున్న సమయం సగటున 7 గంటలు. అయితే 2013 నుంచి ఇది రోజుకూ 50 నిమిషాలు పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగానూ స్ర్కీన్ల నుంచి వెలువడే నీలికాంతివల్ల చర్మ సంబంధిత సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్లూ లైటింగ్ ఎఫెక్ట్ పడకుండా యాంటీ స్ర్కీన్ గ్వార్డులను వాడటంవల్ల కొంత వరకు సమస్యను నివారించవచ్చు. దీనికంటే చక్కటి పరిష్కారం ఏంటంటే.. స్ర్కీన్ చూసే సమయాన్ని చాలా వరకు తగ్గించుకోవడం, లేదా పూర్తిగా చూడకుండా ఉండటమే.
Also Read..