- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Free Condoms : ఉచితంగా కండోమ్స్ పంపిణీ.. సంచలన నిర్ణయం తీసుకున్న దేశం
దిశ, ఫీచర్స్: సాధారణంగా ఇండియాలో కండోమ్స్ కొనేందుకు సంశయిస్తుంటారు. ఫార్మసీకి వెళ్లినా దాన్ని ఎలా అడగాలో తెలియక తటపటాయిస్తుంటారు. కానీ ఈ విషయంలో ఫ్రాన్స్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఫార్మసీలలో స్వేచ్ఛగా, ఉచితంగా కండోమ్‌లు తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చింది. లైంగిక సంక్రమణ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్న దేశం.. వచ్చే ఏడాది నుంచి ఆ దేశ యువకులకు ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధికారికంగా ప్రకటించారు. యూత్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫార్మసీలలో జనవరి 1 నుంచి.. 18-25 సంవత్సరాల వయసు గల వారికి కండోమ్‌లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
వాప్తవానికి 2030 నాటికి ఫ్రాన్స్‌ను 'జీరో న్యూ హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్స్' గా చూడాలని మాక్రాన్ కలలు కన్నారు. ఈ క్రమంలోనే AIDS, STIలకు వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నాలలో భాగంగా డిసెంబర్ 2018 నుంచి ఫ్రెంచ్ సోషల్ సెక్యూరిటీ ద్వారా కండోమ్స్ ఇప్పటికే రీయింబర్స్ చేయబడ్డాయి. మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉన్న మైనర్‌లకు కండోమ్‌లు ఉచితంగా అందించబడ్డాయి. కానీ 2020-2021 రెండింటిలోనూ దేశవ్యాప్తంగా STDల రేటు సుమారు 30 శాతం పెరిగిందని ఫ్రెంచ్ ఆరోగ్య అధికారులు అంచనా వేశారు.
ఇందుకు కారణం ఈ పథకాలు గురించి పెద్దగా అవగాహన లేకపోవడమే అంటున్నారు విశ్లేషకులు. ఫ్రెంచ్ అధ్యక్షుడి కార్యాలయం ప్రకారం.. మైనర్‌లలో 21 శాతం, 18-24 సంవత్సరాల వయసు గల వారిలో 29 శాతం మందికి మాత్రమే వీటి గురించి తెలుసు. దీంతో క్లామిడియా, గోనేరియా వంటి STIలు యువతలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా 15 నుంచి 29 సంవత్సరాల వయసు గల పురుషులలో 2017-19 మధ్య 45 శాతం పెరుగుదల ఉంది. 2021లో కొత్త HIV నిర్ధారణల సంఖ్య కూడా దాదాపు 5,000 వద్ద నిలిచిపోయింది.
- Tags
- condoms