- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జుట్టు వేగంగా పెరగాలంటే ఈ చిట్కాని పాటించండి..!
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ జుట్టు రాలడం పెద్ద సమస్య. వాతావరణ కాలుష్యం, పోషకాల లోపం, అనారోగ్య సమస్యలు వంటి వాటి వల్ల జుట్టు రాలుతుంది. తరుచుగా షాంపులు, కండీషనర్స్ వాడటం వల్ల అందులో ఉండే రసాయనాలు జుట్టును నిర్జీవంగా మారుస్తాయి. అయితే, కొంతమంది అమ్మాయిలు పొడవాటి జుట్టు కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు వేగంగా ఆరోగ్యంగా పెరగాలంటే ఈ చిట్కాలను పాటించండి.
కెరాటిన్ నష్టం జుట్టును చాలా వరకు బలహీనపరుస్తుంది. దీని వల్ల జుట్టు అధికంగా రాలుతుంది. ప్రొటీన్ లోపం కారణంగా జుట్టు ఊడిపోతుంది. చాలామంది తలస్నానం చేసిన తరువాత కండీషనర్ అప్లై చేస్తుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల వెంటవెంటనే హెయిర్ చిక్కు పడుతుందని కొంతమంది దువ్వెనతో దువ్వుకుంటారు. అయితే, ఇది కుదుళ్లకు హాని కలుగుతుందని న్యూయార్క్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అందువల్ల జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు.
విటమిన్లుతో పోషణ: జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే పోషణ చాలా అవసరం. క్యాలరీలు తక్కువగా తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడి, జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. ఒమేగా-3, జింక్, ఐరన్, విటమిన్-బి7, విటమిన్ డి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
ఎసెన్షియల్ ఆయిల్స్: జుట్టు పెరుగుదలకు సాధారణ నూనెతో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్ వాడడం మంచిది. లావెండర్, చామంతి, థైమ్ వంటి వాటిని ఆముదం, కొబ్బరి నూనె వంటి వాటిలో కలిపి ఉపయోగించాలి. అలాగే షాంపులో టీట్రీ ఆయిల్, లైమ్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్ కొన్ని చుక్కలను కలిపి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
నీరు తాగడం: నీరు అధికంగా తాగడం శరీరానికి మాత్రేమ కాదు జుట్టుకు కూడా అవసరమే. బాడీలోని తేమ నిలుపుకోవడం ద్వారా తల చర్మం ఎండిపోకుండా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
తగినంత నిద్ర: జుట్టు పెరుగుదలకు నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర శరీరంలోని పునరుద్ధీకరణ ప్రక్రిలను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
మెంతిపొడి, ఉల్లి రసం: మెంతి గింజలు, ఉల్లిపాయ రసం రెండూ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మెంతి గింజలను గ్రైండ్ చేసి, అందులో ఉల్లిరసం కలిపుకోవాలి. కుదుళ్ల నుంచి జుట్టు మొత్తానికి దీనిని బాగా పట్టించాలి. 10 నిమిషాల తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపుతో స్నానం చేయాలి.
శికకాయ్: రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపులు వాడడం వల్ల జుట్టు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వీటి బదులు శికకాయ్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేందుకు ఇది సహాయపడుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.