నిత్యయవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి

by Prasanna |   ( Updated:2023-07-25 10:35:31.0  )
నిత్యయవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి
X

దిశ, వెబ్ డెస్క్ : వయసు మీద పడుతున్న కొద్ది చర్మం ముడతలు పడి పోతుంటుంది. కానీ కొందరు మాత్రం ఎంత వయసు వచ్చినా.. నిత్యయవ్వనంగా కనిపిస్తారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెలబ్రెటీలు. వారు బ్యూటీ ట్రీట్​మెంట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. యవ్వనంగా కనిపించాలంటే ఈ చిట్కాలను పాటించండి.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి.

2. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసులు గోరు వెచ్చటి మంచి నీటిని సేవించండి.

3. ప్రతి రోజూ కనీసం పదిహేను నిముషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి.

4. రోజుకి యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు.

5. రోజుకి ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

6. రోజుకి ఒక గ్లాసు నిమ్మకాయం రసం తాగితే శరీరంలో కొవ్వుని తీసేస్తుంది.

7. రోజుకి ఒక కప్పు పాలు తాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

8. తాగు నీటిలో కాస్త సోంపు కలిపి తాగి నట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది.

9. నీళ్లలో నాన బెట్టిన ఖార్జురాలను పరగడుపున రోజూ మూడు తింటే కొవ్వు కరిగిస్తుంది. ఎముకలను దృఢపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరానికి కావాల్సిన ఐరన్ ను అందిస్తుంది.

Read More :

ఒత్తిడిలేని ప్రశాంతమైన జీవితాన్ని కావాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ఈ ఐదు విత్తనాలతో బరువు తగ్గడం ఖాయం.. నిపుణులు తెలిపేది ఇదే

అరటి పండ్లు అతిగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా?


Advertisement

Next Story

Most Viewed