జీవితంలో సంతోషంగా ఉండాలా!

by Jakkula Samataha |
జీవితంలో సంతోషంగా ఉండాలా!
X

దిశ, ఫీచర్స్ : సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతీ ఒక్కరూ రోజూ సంతోషంగా, ఆనదంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే ఎప్పుడూ సంతోషంగా గడుపుతారు. మరికొంత మంది ఏదో బాధ, చిన్న చిన్న సమస్యలతో సతమతం అవుతారు.

అయితే ఎలాంటి సమస్యలున్నా..రోజూ సంతోషంగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ జీవితంలో చేసే చిన్న చిన్న మార్పులు మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. మీకు ఇష్టమైన ఏదైనా పనిని చేస్తూ ఉండాలి. అందులో కొత్తదనాన్ని నేర్చుకోవాలి అప్పుడే మన సమస్యల్ని మర్చిపోయి సంతోషంగా ఉంటామంట. అలాగే నాదగ్గర ఇది లేదు, తన వద్ద అన్నీ ఉన్నాయి అంటూ బాధపడకూడదంట. ఏదీ లేకున్నా బతకగలుగుతాను, ఇవి చిన్న చిన్న సమస్యలే నేడు రేపు పోతాయి అని సర్ధి చెప్పుకోవాలంట మన మనసుకు.

జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగితేనే జీవించాలన్న కోరిక ఇంకా పెరుగుతుంది. మీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మీ నిర్ణయాల్లో, మీ ఆలోచనలు సంతృప్తి ఉండాలి. సంతృప్తి లేకపోతే కోరికలు ఎక్కువైపోతాయి. ఆ కోరికలే చివరికి బాధకు, దుఃఖానికి కన్నీళ్ళకు కారణం అవుతాయి. అలాగే ఏదైనా బాధగా అనిపించినప్పుడు మనకు ఇష్టమైన వారితో ఎక్కువ సేపు మాట్లాడటం లాంటివి చేయాలంట. దాని వలన మనసులో బాధలు తగ్గిపోయి సంతోషంగా ఉంటాం.

Advertisement

Next Story

Most Viewed