- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చలికాలంలో చేతివేళ్లు, కాళ్లు వాపు వస్తున్నాయా .. అయితే ఈ రెమిడీస్ ని పాటించండి
దిశ, ఫీచర్స్ : చలి ఎక్కువగా ఉన్న పరిస్థితిలో చర్మం పొడిబారడం, దురదలు రావడంతో పాటు ఎరుపు రంగులో మచ్చలు చేతులు, కాళ్లపై కనిపిస్తుంటాయి. ఎర్రగా మారినప్పుడు దురదతో పాటు వాపు కూడా మొదలవుతుంది. చలికాలంలో ఇలాంటి సమస్యలు రావడం సర్వసాధారణమయినప్పటికీ కొన్నిసార్లు దీని వల్ల సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే ఇలాంటి సమస్యను పరిష్కరించుకునేందుకు వైద్యుని దగ్గరికి వెళ్లకుండా, ఇంట్లోనే కొన్ని చిట్కాలు సరిపోతుందంటున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రాతి ఉప్పుతో చిన్న చిట్కా..
చలికాలంలో చేతులు, కాళ్ల వాపుల నుంచి ఉపశమనం పొందాలంటే గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు కలిపి ఆ నీటిలో కాళ్లు చేతులు 10 నుంచి 15 నిమిషాలు పెట్టాలి. ఆ నీటి వెచ్చదనం నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. ఎక్కువ సార్లు వేడి నీటిని పాదాలపై పోసుకున్నా పాదాల చర్మం పొడిబారడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
వేడి నూనెతో మసాజ్..
ఒక కప్పులో కొద్దిగా ఆలివ్, కొబ్బరి లేదా ఆవాల నూనెను తీసుకుని, పాన్ మీద ఉంచి వేడి చేయాలి. అనంతరం కొద్దిగా నూనెను చేతులతో తీసుకుని నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. ఇలా చేస్తే సిరల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. పాదాల్లో వాపు ఉన్నంత వరకు నూనె వేడి చేసి రోజుకు రెండు మూడు సార్లు మసాజ్ చేయాలి. మసాజ్ చేసేటప్పుడు గది ఉష్ణోగ్రత సాధారణంగా ఉండాలని గుర్తుంచుకోండి.
కొబ్బరి నూనె, కర్పూరం
కొబ్బరి నూనె వేడి చేసి అందులో కర్పూరం వేయాలి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత, వాపు, ఎరుపు ఉన్న చోట చేతులతో లైట్ గా మసాజ్ చేయాలి. ఇది దురదను తగ్గించడంలో సహాయపడుతుంది.
నూనె, కొవ్వొత్తి
ఆవాల నూనె వేడి చేసి అందులో కొవ్వొత్తి పెట్టాలి. కొవ్వొత్తి పూర్తిగా కరిగిపోయే వరకు మరిగించాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత సున్నితంగా మసాజ్ చేస్తూ వాపు ఉన్న చోట అప్లై చేయాలి. 2 నుండి 3 సార్లు అప్లై చేసిన తర్వాత మీకు ఉపశమనం కలుగుతుంది.
పిండి
పిండి వెచ్చదనం నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం, పిండిని పేస్ట్ లా చేసి, నొప్పి ఉన్న ప్రదేశంలో 20 నుంచి 30 నిమిషాల పాటు రాయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.