Festivals List In October: అక్టోబర్‌లో దసరాతోపాటు ఉన్న పండుగల లిస్ట్ ఇదే..!

by Kavitha |
Festivals List In October: అక్టోబర్‌లో దసరాతోపాటు ఉన్న పండుగల లిస్ట్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి నెలలో పండుగలు రావడం కామన్. అలాగే అక్టోబర్ నెలలో కూడా ఫెస్టివల్స్ వస్తున్నాయి. మైయిన్‌గా ఈ మంత్‌లో వచ్చే దసరా పండుగ చాలామందికి చాలా స్పెషల్. ఇంకా తెలంగాణలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవరాత్రులు అంటూ బతుకమ్మను పెట్టి ప్రతి రోజు దుర్గామాత ముందు ఆడి, పాడుతూ ఊరు ఊరంతా ఎంజాయ్ చేస్తారు. ఇక శివుని ఆరాధన కోసం ఈ మాసంలో ప్రత్యేక ప్రదోష వ్రతం ఉంటుంది. ఇది కాకుండా 2024లో రెండవ, చివరి చంద్రగ్రహణం కూడా అక్టోబర్‌లో సంభవవించబోతుంది. సాధారణ భాషలో చెప్పాలంటే మతపరమైన దృక్కోణంలో ఈ నెల చాలా ముఖ్యమైనది. మరి అక్టోబర్ నెలలో వచ్చే పండుగల లిస్ట్‌ను ఇప్పుడు మనం చూద్దాం..

అక్టోబర్ 01 (Tue) - బతుకమ్మ ప్రారంభం

అక్టోబర్ 02 (Wed) - మహాలయ అమావాస్య , లాల్ బహదూర్ శాస్త్రి జయంతి , గాంధీ జయంతి , అమావాస్య

అక్టోబర్ 03 (Thu) - దేవి శరన్నవరాత్రి ప్రారంభం

అక్టోబర్ 04 (Fri) - చంద్రోదయం , ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

అక్టోబర్ 06 (Sun) - చతుర్థి వ్రతం

అక్టోబర్ 07 (Mon) - లలితా పంచమి , సోమవారం వృతం

అక్టోబర్ 09 (Wed) - దుర్గ పూజ , సరస్వతి పూజ ప్రారంభం , స్కంద షష్ఠి , సద్దుల బతుకమ్మ పండుగ

అక్టోబర్ 10 (Thu) - చిత్త కార్తె , సరస్వతి పూజ

అక్టోబర్ 11 (Fri) - దుర్గాష్టమి వ్రతం , మహర్నవమి , దుర్గాష్టమి

అక్టోబర్ 12 (Sat) - సరస్వతి పూజ , విజయ దశమి

అక్టోబర్ 13 (Sun) - పాశాంకుశ ఏకాదశి

అక్టోబర్ 15 (Tue) - ప్రదోష వ్రతం

అక్టోబర్ 17 (Thu) - తులా సంక్రమణం , వాల్మీకి జయంతి , శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , పౌర్ణమి

అక్టోబర్ 18 (Fri) - తులా కావేరి స్నానం

అక్టోబర్ 20 (Sun) - ఉండ్రాళ్ళ తద్దె , సంకటహర చతుర్థి

అక్టోబర్ 21 (Mon) - కార్వా చౌత్

అక్టోబర్ 24 (Thu)- స్వాతి కార్తె

అక్టోబర్ 28 (Mon) - రమ ఏకాదశి

అక్టోబర్ 29 (Tue) - దంతేరాస్ , ప్రదోష వ్రతం

అక్టోబర్ 30 (Wed) - ధన్వంతరి జయంతి , ధన త్రయోదశి , మాస శివరాత్రి

అక్టోబర్ 31 (Thu) - నరక చతుర్దశి , దీపావళి

Advertisement

Next Story

Most Viewed