Shocking: సంగారెడ్డిలో దారుణం!.. టీవీ చూద్దామని చెప్పి ఏడెళ్ల చిన్నారిపై అత్యాచారం

by Ramesh Goud |
Shocking: సంగారెడ్డిలో దారుణం!.. టీవీ చూద్దామని చెప్పి ఏడెళ్ల చిన్నారిపై అత్యాచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీవీ చూద్దామని చెప్పి పిలిచి ఏడేళ్ల చిన్నారిపై ఓ మైనర్ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్(17) తన పొరుగింట్లో ఉండే ఏడు సంవత్సరాల పాపను టీవీ చూద్దాం అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, ఆ పాప ఇంట్లో వదిలేశాడు. బయటకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చే చూసే సరికి పాప స్పృహ కోల్పోయి ఉంది. నిశితంగా పరిశీలించి చూడగా.. పాపకు రక్తస్రావం అయినట్లు కనిపించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు పాపపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. దీనిపై ఆరా తీయగా తమ ఇంటి పక్కన ఉండే మైనర్ బాలుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదులో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోని తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed