Fennel Benefits : సోంపులో అంత పవర్ ఉందా..? ఆ సమయంలో తింటే కలిగే బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!

by Javid Pasha |   ( Updated:2024-08-29 13:39:11.0  )
Fennel Benefits : సోంపులో అంత పవర్ ఉందా..? ఆ సమయంలో తింటే కలిగే బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!
X

దిశ, ఫీచర్స్ : హెల్తీగా ఉండాలని మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. పండ్లు, కూరగాయలు వంటివి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కానీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సోంపు గురించి మాత్రం చాలా మంది పట్టించుకోరు. ఏ ఫంక్షన్‌లోనో, హోటల్లోనో భోజనం చేసినప్పుడు తప్ప సాధారణ సమయంలో దానిని తినడం చాలా అరుదు. కానీ అది ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.

* సోంపులో పోషకాలతోపాటు ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి భోజనం తర్వాత తినడం చాలా మంచిది. కొందరు ఉదయంపూట పరగడుపు కూడా తింటుంటారు. ఎలా తిన్నా హెల్త్‌‌కు మంచిది. ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపులో ఉబ్బరం, గ్యాస్, ఛాతీలో మంట వంటి సమస్యలు తగ్గిపోతాయి. సోంపు నానబెట్టిన వాటర్ కూడా డిటాక్స్ పానీయంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

* నోటి దుర్వాసన పోగొట్టడంలోనూ సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోరు, చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు, నొప్పుల నివారణలో సహాయపడతాయి.

* కొందరికి మార్నింగ్ నిద్ర మేల్కోగానే తిల తిరగడం, వికారం, అలసట వంటివి కలుగుతుంటాయి. కొందరు మహిళలు గర్భధారణ సమయంలో కూడా ఇలాంటి మార్నింగ్ సిక్‌నెస్ ఫేస్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే సోంపు తినడం లేదా సోంపు వాటర్ తాగడంవల్ల క్రమంగా ఆ సమస్య నుంచి బయటపడతారని ఆయుర్వేదిక్ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే లివర్, కిడ్నీల్లోని విషదార్థాలను నివారించడంలోనూ సోంపులోని ఔషధ గుణాలు బాగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు.

* సోంపును తరచుగా తినడం, నానబెట్టిన నీళ్లను తాగడం ప్రతిరోజూ కొనసాగించే వారిలో ఊబకాయం సమస్య కూడా రాకుండా ఉంటుంది. అందుకే భోజనం తర్వాత గానీ, మరే సందర్భంలో గానీ సోంపు తినడం చాలా మంచిది. ముఖ్యంగా ఉదయంపూట సోంపు వాటర్ తాగడం చాలా మంచిది. దీనివల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed