BOSS - OFFICE : మీ బాస్ కు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారా? ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవండి...

by Sujitha Rachapalli |
BOSS - OFFICE : మీ బాస్ కు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారా? ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవండి...
X

దిశ, ఫీచర్స్ : వర్క్ ప్లేస్ లో చాలా మంది ప్రొఫెషనల్స్ బాస్ కారణంగా ఇబ్బంది పడుతుంటారు. తాము క్రియేటివ్ గా పని చేద్దామని అనుకున్నా.. ఏదో ఒక కారణంతో అడ్డుపడుతుంటారు. ఆ పని చేయకుండా ఉండేలా చేస్తారు. దీనివల్ల డిస్ కరేజ్ ఫీల్ అవుతారు. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మైక్రో మేనేజింగ్, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో తడబాటు ఇందుకు రీజన్ అయి ఉండొచ్చు. కాగా నిజంగా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే.. బాస్ తో మాట్లాడాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆఫీసు నుంచి వెళ్ళిపోయే బదులు సమస్య ఏంటో వివరంగా చెప్తే బెటర్ సొల్యూషన్ దొరుకుతుందని... మీ ఫీడ్ బ్యాక్ సంస్థకు కూడా ఉపయోగపడవచ్చని అంటున్నారు. ఫీడ్ బ్యాక్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ టిప్స్ అందిస్తున్నారు.

కాంప్లిమెంట్స్ తో స్టార్ట్

ముందుగా బాస్ కు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాలను హైలెట్ చేయడం ద్వారా సంభాషణను ప్రారంభించండి. వారి నాయకత్వ శైలి గురించి మీరు ఏం ఇష్టాడుతున్నారు.. వారి మార్గదర్శకత్వం పొందడాన్ని ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నారో చెప్పండి. వారి శిక్షణలో ఎంత నేర్చుకున్నారు.. ఎటువంటి ప్రోత్సాహం లభించిందనే విషయాలను ప్రస్తావించడం మంచిది. అప్పుడే మీ బాస్ మీ కన్వర్జేషన్ యాక్సెప్ట్ చేస్తాడు. మీరు చెప్పే మాటలను స్వీకరించే మోడ్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటాడు.

సమస్యల ప్రస్తావన

ఒక్కసారి మీ బాస్ మీరు చెప్పేది వినడం స్టార్ట్ చేశాక.. పాజిటివ్ ఉన్నట్లు అనిపిస్తే సమస్యల గురించి ప్రస్తావించడానికి సమయం దొరికినట్లే. ఆ అవకాశం వచ్చిందనిపిసే వెంటనే దాని గురించి మాట్లాడటం ప్రారంభించండి. వారు విధించే నిబంధనలు మీ పని తీరును, ప్రొడక్టివిటీని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చెప్పవచ్చు. మృదువుగా ఉంటూనే.. సమస్యలను వాస్తవంగా వివరించడం ముఖ్యం. కాగా నిందలు, ఆరోపణలు చేస్తూ మాట్లాడటం సరికాదని గుర్తుంచుకోవాలి.

వాదనను బ్యాక్ అప్ చేయాలి...

మీరు మీ బాస్ ముందు ఒక సమస్య గురించి చెప్పాకా.. మరింత వివరణాత్మకంగా చెప్పమని కోరే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి ఇందుకు తప్పనిసరిగా సిద్ధంగా ఉండాలి. మీరు చెప్పాలనుకుంటున్న ప్రాబ్లమ్స్ గురించి బ్యాక్ అప్ చేసే సత్తా అవసరం. ఉదాహరణల నుంచి సవివరణ వరకు అన్నీ అవసరమే అంటున్నారు నిపుణులు. అప్పుడే మీరు చెప్పే మాటలకు కన్విన్స్ అవుతారని.. మద్దతిస్తారని చెప్తున్నారు.

స్పష్టత అవసరం

మీరు ఎగ్జాంపుల్స్ తో సహా సమస్యల గురించి వివరించినా.. బాస్ ఇంత జరుగుతుందా అనుకుంటూ భవిష్యత్తులో ఏం చేయాలనేదానిపై క్లూలెస్ గా ఉండొచ్చు. మీకు న్యాయం చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీకు ఏం కావాలో మీరే క్లారిటీ ఇవ్వండి. ఏం కావాలో నేరుగా అడిగేయండి.

అభిప్రాయ సేకరణ

ప్రాబ్లమ్, ప్రొడక్టివిటీ, ఫీడ్ బ్యాక్.. ఈ ప్రాసెస్ ముగిశాక.. మీ ఆందోళన గురించి పూర్తిగా వివరించాక..ఆయన ఒపీనియన్ కూడా అడగండి. ఈ పద్ధతి మీ వర్క్ స్టైల్, ప్రవర్తనలో కొన్ని మార్పులకు ప్రయత్నించే హేతుబద్ధమైన వ్యక్తిగా మీపైన మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed