మేక‌ను అరెస్ట్ చేయ‌డ‌మే కాదు, ప్ర‌శ్నించిన పోలీసులు..! (వీడియో)

by Sumithra |
మేక‌ను అరెస్ట్ చేయ‌డ‌మే కాదు, ప్ర‌శ్నించిన పోలీసులు..! (వీడియో)
X

దిశ‌, వెబెడెస్క్ః జంతు ప్రేమికులు ఎవ‌రైనా ఉంటే, 'ఎంత దారుణం నోరు లేని మూగ‌జీవాన్ని అరెస్ట్ చేసి, ప్ర‌శ్న‌ల‌తో హింసిస్తారా..?' అని ఆవేశ‌ప‌డ‌తారేమో.. ఒక పోలీసు అధికారి, ఒక జంతు నియంత్రణ అధికారి, ఒక మేకను వెంటాడి, ప‌ట్టుకున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ విచిత్రమైన ఘ‌ట‌న‌కు కార‌ణం, ఓ మేక ఇష్టారాజ్యంగా పొరుగు ప్రాంతంలో షికారు చేస్తూ, ఓ ఇంటి పెర‌ట్లో దూర‌డ‌మే! ఇది గ‌మ‌నించిన‌ ఇండియానా పోలీసులు మేక‌ను ప‌ట్టుకొన్న వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కంబర్‌ల్యాండ్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసిన‌ ఈ పోస్ట్ ప్రకారం, వుడ్‌లార్క్ డ్రైవ్ అనే ప్రాంతంలో ఓ మేక ఇళ్ల మధ్య ప‌రిగెత్తుతూ హ‌ల్‌చ‌ల్ చేస్తుందంటూ మారియన్ కౌంటీకి చెందిన ఒక అధికారి, జంతు నియంత్రణ అధికారిని పిలిచారు. పోలీసులు వచ్చేసరికి మేక ఓ ఇంటి పెరట్లో ఉందని, తాము మేక యజమానులం కాదని అక్కడ నివాసముంటున్న వారు చెప్పారు. యార్డ్ చుట్టూ ఉన్న‌ పోలీసులు మేకను వెంబడించి, చివ‌ర‌కు అరెస్ట్ చేశారు.

"ప్ర‌శ్నించ‌డం కోసం మేకను అదుపులోకి తీసుకోగలిగారు" అంటూ రాసిన క్యాప్ష‌న్‌తో ఈ విచిత్రమైన ఛేజ్ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. "ఈ వీడియోలో కెప్టెన్ క్రూక్, యానిమల్ కేర్ & కంట్రోల్, చాలా నైపుణ్యంతో మేకను ప‌ట్టుకోవ‌డం చూడొచ్చు. సరైన యాజమాని దొరికే వరకు దానికి మంచి ఆహారం అందించే సౌకర్యం ఏర్పాటుచేస్తున్న‌ట్లు చెప్పారు. మేక కోసం వెతికేవారు మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని కానీ, లేదా మారియన్ కౌంటీ యానిమల్ కేర్ & కంట్రోల్‌ను సంప్రదించండ‌న్నారు. ఈ ఘటనలో అధికారులు లేదా జంతువులకు ఎలాంటి గాయాలు కాలేదు" అని రాశారు.

"డిటెక్టివ్ మార్క్ మేకను ప్రశ్నిస్తున్న వీడియోను చూడాలనుకుంటున్నాను" అని ఓ వ్య‌క్తి కామెంట్ పెట్టారు. "తన ఇష్టానికి వ్యతిరేకంగా చట్టవిరుద్ధంగా నిర్బంధించింనందుకు మేక సివిల్ దావాను దాఖలు చేస్తుందని అనుకుంటున్నాను" అని మ‌రొక‌రు పోస్ట్ చేశారు. కామెంట్ల‌కు స్పందించిన పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్ ఖాతాలో, "(...) అతిక్రమణ (ట్రెస్‌పాసింగ్‌), అరెస్టును అడ్డుకోవడం అభియోగాలు మోపాము!" అంటూ ఫ‌న్నీ రిప్లై ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed