- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేట్‌నైట్ స్లీప్‌తో హెల్త్ రిస్క్.. ఏం జరుగుతుందంటే..
దిశ, ఫీచర్స్ : కారణాలేమైనా ప్రజల జీవన శైలిలో ఇటీవల పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో లేట్‌నైట్ స్లీపింగ్ ఒకటి. ఒకప్పుడు రాత్రి 9 గంటలకే నిద్రపోయి, మార్నింగ్ 5 నుంచి 6 గంటలలోపు నిద్ర మేల్కొనేవారు. సూర్యోదయానికి ముందు ప్రకృతి అనుకూల జీవనంతో హెల్తీగా ఉండేవారు. కానీ పెరుగుతున్న పట్టణీకరణ, బిజీ వర్క్ షెడ్యూల్స్, షిఫ్ట్‌వైజ్ ఉద్యోగాల కారణంగా నిద్రవేళల్లో మార్పులు సహంజగానే వస్తున్నాయి. సిటీల్లో చాలామంది అర్ధరాత్రి 12 తర్వాతనే నిద్రకు ఉపక్రమించే పరిస్థితులు నెలకొంటున్నాయి. కొందరైతే రాత్రి 2 లేదా3 గంటలకు కానీ నిద్రపోరు.
అయితే ఇలాంటి లేట్ నైట్ స్లీపింగ్ హ్యాబిట్‌తో ఆరోగ్యాలు పాడవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి జీవనశైలి దీర్ఘకాలంపాటు కొనసాగే వారిలో టైప్-2 డయాబెటిస్ బారినపడే రిస్క్ 19 శాతం పెరుగుతుందని రీసెంట్ స్టడీలో వెల్లడైంది. పైగా రాత్రి లేట్‌గా పడుకునే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం, సాయంత్రం తర్వాతే ఎక్కువగా తినడం వల్ల సహజ సిద్ధంగా జరిగే శరీర జీవక్రియలకు ఆటంకం కలుగుతుంది. ఈ పరిస్థితి బ్లడ్ షుగర్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. క్వాలిటీ స్లీప్ దూరం అవుతుంది.