వేసవిలో డీహైడ్రేషన్‌ రిస్కును పెంచే ఆహారాలు ఇవే.. దూరంగా ఉండటమే బెటర్..

by Dishafeatures2 |
వేసవిలో డీహైడ్రేషన్‌ రిస్కును పెంచే ఆహారాలు ఇవే.. దూరంగా ఉండటమే బెటర్..
X

దిశ, ఫీచర్స్ : వేసవిలో మనం తినే ఆహారాలు, తాగే పానీయాలు కూడా ఆరోగ్యంపై ప్రతికూల, సానుకూల ప్రభావాలు చూపుతాయని నిపుణులు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో కొన్ని రకాల పదార్థాలు ఫుడ్ పాయిజనింగ్‌కు లేదా డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. కొన్నిసార్లు వాంతులు, వికారం వంటి అనారోగ్యాలకు కారణం కావచ్చు. కాబట్టి సమ్మర్‌లో తినకూడని ఆహార పదార్థాలు ఏవో తెలుసుకుందాం.

* స్నాక్స్ తినే అలవాటు దాదాపు అందరికీ ఉంటుంది. కానీ ఎండాకాలంలో కొన్నిరకాల స్నాక్స్ తినడంవల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా సోడియం అధికంగా ఉండే చిప్స్, రింగ్స్, క్రాకర్స్, జంతికలు వంటి ప్యాకేజ్డ్ స్నాక్స్ తింటే వాంతులు, విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. మధ్యహ్నం వేళ బయట తిరిగే వారు వీటిని తింటే డీహైడ్రేషన్ బారిన పడే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటికి బదులు తాజా పండ్లు, మజ్జిగ వంటివి తీసుకోవడం బెటర్.

* ఇటీవల ఆహారపు అవాట్లలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. హెల్తీ ఫుడ్స్‌కు బదులు నోటికి రుచిగా అనిపించే జంక్ ఫుడ్స్‌వైపే మొగ్గుతున్నారు కొందరు. బయట లభించే హాట్ డాగ్, పిజ్జా, బర్గర్, సాసెస్ వంటి హై‌ప్రాసెస్డ్ ఆహారాలు, స్నాక్స్ వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వేసవిలో వీటిని తినడంవల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తవచ్చు. వీటితోపాటు మద్యం, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు, స్పైసీ ఫుడ్స్ కూడా డీహైడ్రేషన్ రిస్కును పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తు్న్నారు.

Next Story

Most Viewed