- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Carrot Juice: రోజుకొక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగాల్సిందే అంటున్న నిపుణులు.. ఎందుకంటే..?

దిశ, వెబ్ డెస్క్ : మనలో కొందరు కూరగాయలు తినడానికే ఇష్టపడతారు. వాటిలో అన్ని సీజన్లలో దొరికే క్యారెట్ ను ఎక్కువగా తింటారు. దీన్ని కొందరు కూరల్లో వేసుకుంటారు. మరి కొందరు పచ్చిగానే తినేస్తారు. కారణం.. ఇది మంచి రుచిని కలిగి ఉంటుంది. రోజుకొక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. క్యారెట్లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. శరీరంలో " విటమిన్ ఎ " లోపిస్తేనే
కళ్ళ సమస్యలు వస్తాయి. కాబట్టి, వీరు రోజుకొక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
2. ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. అలాంటి వారు కూడా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి వెంటనే పెరుగుతుంది. అలాగే, శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పంపి వేస్తాయి.
3. క్యారెట్ నేరుగా తినే కన్నా జ్యూస్ తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటుంది. అలాగే, క్యారెట్లలో ఉండే విటమిన్ బి6, కె, పొటాషియం, పాస్ఫరస్ లు ఎముకలను బలంగా చేస్తాయి.
4. అలాగే, చర్మ సమస్యలతో బాధపడేవారికీ క్యారెట్ మంచిగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా చేస్తుంది. అలాగే, చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే, మచ్చలు కూడా తొలగిపోతాయి.
5. రోజూ ఉదయం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే, గుండె పని తీరు కూడా మెరుగుపడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.