గార్డెనింగ్‌తో రిస్క్.. బయటపడే మార్గాలేంటో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-06-05 06:41:41.0  )
గార్డెనింగ్‌తో రిస్క్.. బయటపడే మార్గాలేంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: చాలా మంది గార్డెనింగ్‌ పనిని విశ్రాంతినిచ్చే కాలక్షేపంగా చూస్తారు. చక్కటి వాతావరణంలో ఎక్కువ సమయం గడపడానికి ఇదొక చక్కటి అవకాశంగా భావిస్తారు. కానీ తోటపనివల్ల కూడా కొన్ని ఆరోగ్యపరమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. తరచుగా లాన్ మూవర్స్, పవర్ టూల్స్ వంటి పనిముట్లతో గాయపడే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా చెట్లను, గడ్డిని కత్తిరించే సమయంలో, కంపోస్ట్ సంచులను, గార్డెనింగ్ మట్టిని ముట్టుకోవాల్సి వచ్చినప్పుడు హానికరమైన బ్యాక్టీరియాలకు, ఫంగస్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. వీటివల్ల పలు రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అందుకే వాటినుంచి మనల్ని మనం రక్షించుకోవడంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ధనుర్వాతం, లెజియోనెల్లారిస్

గార్డునింగ్ పనివల్ల ధనుర్వాతం(Tetanus) అనే వ్యాధి(nasty disease) వచ్చే అవకాశం ఉంటుంది. క్లోస్ట్రిడియం టెటాని అనే బ్యాక్టీరియా నుంచి వచ్చే టాక్సిన్ ఎఫెక్ట్‌వల్ల కండరాల్లో నొప్పులు, బిగుసుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కొందరికి దవడలు లాక్ చేయబడిన పరిస్థితికి చేరుకొని మాట్లాడటానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మట్టిలోనూ, కంపోస్టులోను ఉంటుంది.

గులాబీ చెట్లకు ఎరువులు వేసినప్పుడు ఇది ఇది చెట్టు కాండంపై, ముళ్లపై నివసిస్తుంది. అందుకే గులాబీ ముళ్లు గుచ్చుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు గార్డెనింగ్ కంపోస్టులో లెజియోనెల్లా(Legionella) అనే బ్యాక్టీరియా ఉండటంవల్ల ఇది లెజియోనెల్లారిస్ వ్యాధికి కారణం అవుతుంది. ముఖ్యంగా ఇది వృద్ధులపై, బలహీన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శ్వాస పీల్చినప్పుడు లోపలికివెళ్తే ప్రాణాంతకమైన న్యుమోనియాకు దారితీస్తుంది.

లెప్టోస్పిరోసిస్, పవర్ టూల్స్

లెప్టోస్పిరా(Leptospira) అనేది ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటిలో ఉండే బ్యాక్టీరియా. వ్యక్తులు తోటపనిచేస్తున్నప్పుడు ఎలుకల స్థావరాలు గుర్తించి తీసివేయడం, చెట్లకు నీళ్లు పట్టడం చేస్తుంటారు. ఈ సందర్భంగా లెప్టోస్పిరోసిస్ బ్యాక్టీరియా బారిన పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల్ లెప్టోస్పిరోసిస్ వ్యాధితోపాటు చలి జ్వరం, తలనొప్పి, వాంతులు, కామెర్లు వస్తాయి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే లివర్, కిడ్నీ ఫెయిల్యూర్స్‌కు దారితీసే అవకాశం ఉంటుంది.

ఇక గార్డెనింగ్‌లో ఉపయోగించే పవర్ టూల్స్ ముఖ్యంగా హెడ్జ్ ట్రిమ్మర్లు(Hedge trimmers ), లాన్ మూవర్స్ వంటివి చెట్లను, పొదలను కత్తిరించే సందర్భంలో గాయాలకు కారణం అవుతుంటాయి. వాటికి అమర్చిన ఎలక్ట్రికల్ కేబుల్స్ వల్ల కరెంట్ షాక్ తగిలే చాయిసెస్ ఉంటాయి. కాబట్టి తోటపని చేసేవారు కాళ్లకు, చేతులకు సేఫ్టీ కిట్స్ ధరించాలని, పవర్ టూల్స్‌ను జాగ్రత్తగా యూజ్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. అలాగే తరచూ గార్డెనింగ్ పనిచేసేవారు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించి తగిన సహాయం పొందాలి.

ఇవి కూడా చదవండి:

Toothbrush: బ్రష్‌ చేసే టప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి?

Kitchen: ఈ వంటింటి చిట్కాల గురించి మీకు తెలుసా?

Advertisement

Next Story

Most Viewed